News March 23, 2024

శిల్పారామంలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

image

వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా HYD మాదాపూర్‌లోని శిల్పారామంలో ఈరోజు బెంగళూరు నుంచి విచ్చేసిన ప్రముఖ భరతనాట్య కళాకారిణి గుణశ్రీ నర్తన గణపతిమ్, రారావేణు, శృంగారలహరి, మరకతమణిమయ అంశాలను ప్రదర్శించి అలరించారు. HYD వాసి సుభాషిణి గిరిధర్ తన శిష్య బృందంచే భరతనాట్య ప్రదర్శనలో గణేశా, కార్తికేయ, నటేశ కౌతం, కాళీ కౌత్వం, నగుమోము, కాలై థూకి, తిల్లాన అంశాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

Similar News

News April 20, 2025

HYD: పీహెచ్డీ కోర్సు వర్క్ పరీక్ష తేదీల ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీహెచ్డీ కోర్స్ వర్క్ (ప్రీ పీహెచ్డీ) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ప్రీ పీహెచ్డీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్ సైట్‌లో చూసుకోవాలని సూచించారు.

News April 19, 2025

HYDలో వ్యభిచార ముఠా గుట్టురట్టు

image

సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట్‌ బాపుబాగ్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కాసమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఇద్దరు యువతులను రక్షించి, ముఠాలోని అవియాజ్, హుస్సేన్‌లను అరెస్ట్ చేశారు. ఉద్యోగాల కోసం HYDకు వచ్చిన అమాయకపు యువతులను స్వప్న అనే మహిళ ఈ కూపంలోకి దించుతోందని గుర్తించారు. ఈ ముఠాలోని లడ్డు, స్వప్న పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

News April 19, 2025

HYDలో తరచూ కనిపిస్తున్న చిరుత

image

నగరంలోని పలు ప్రాంతాల్లో 2014 నుంచి చిరుతలు కనిపిస్తున్నాయి. మొదటిసారి 2014లో ఇక్రిశాట్లో కనిపించగా జూన్ 2019లో మళ్లీ ఇక్రిశాట్‌లో కనిపించింది. ఆ తరువాత జనవరి 2020లో కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో, డిసెంబర్ 2022లో హెటిరో డ్రగ్స్ ప్లాంట్‌లో, మే 2024లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ భూముల్లో, జనవరి 2025లో రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో.. ఇపుడు మళ్లీ ఇక్రిశాట్లో చిరుతలు కనిపించాయి.

error: Content is protected !!