News January 9, 2025
శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్యాలు
మాదాపూర్‌లోని శిల్పారామంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నాట్య గురువు నిర్మల విశ్వేశ్వర్ రావు శిష్యబృందం చేసిన నృత్యాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. కళాకారులు సనాతన నర్తన గీతం, పుష్పాంజలి, భజమానస, గీతం, చక్కని తల్లికి, రామ గీతం, తాండవ నృత్యకారి, తరంగం, మంగళం తదితర అంశాలను ప్రదర్శించి అలరించారు.
Similar News
News January 9, 2025
HYD: జీడిపప్పుతో ఆరోగ్యానికి బోలెడు లాభాలు!
✓జీడిపప్పు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది✓చర్మ సంరక్షణకు దోహదపడుతుంది✓మెదడు పనితీరును సైతం మెరుగుపరుస్తుంది ✓కంటి చూపును సైతం మెరుగుపరిచే శక్తి ఉంది✓ఎముకలు బలంగా ఉండటానికి సహకరిస్తుంది✓రక్తంలోని చక్కర స్థాయిలను సైతం కంట్రోల్ చేస్తుంది. •జీడిపప్పు తినడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయని TGFPS-RR అనేక తెలిపారు.
News January 9, 2025
HYD: త్వరలో HMDA ప్లాట్లు మరోసారి వేలం!
HYD మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో 1,500 నుంచి 2,000 ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో పలు దఫల్లో వేలం వేసినా మిగిలిపోయాయి. అయితే తాజాగా..మరోసారి వేరే వేయాలని నిర్ణయించారు. 8-14 అంతస్తుల అపార్ట్మెంట్ టవర్ల నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోయింది. దీంతో రాజీవ్ స్వగృహ ఇండ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
News January 9, 2025
HYD: AIDS వచ్చిన వారిని వెలివేస్తే జైలు శిక్ష..!
HIV/AIDS వచ్చిన వారిపై ఉద్యోగ స్థలంలో వివక్ష చూపి, వెలివేస్తే చట్టపరకారంగా జైలు శిక్ష ఉంటుందని HYD, MDCL TGSACS అధికారులు హెచ్చరించారు. HIV/AIDS నివారణ, నియంత్రణ చట్టం 2017 ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. AIDS ఉన్నవారితో మాట్లాడడం, కలిసి భోజనం చేయడం, కలిసి ఉద్యోగం చేయడం వల్ల మరొకరికి సోకదని, కేవలం అసురక్షితమైన లైంగిక కలయికతో మాత్రమే వస్తుందని తెలిపారు.