News June 27, 2024
శిల్పారామాన్ని సందర్శించిన విదేశీ మీడియా ప్రతినిధుల బృందం

మాదాపూర్‌లోని శిల్పారామాన్ని విదేశీ మీడియా ప్రతినిధుల బృందం సందర్శించింది. జార్జియా, ఆర్మేనియా, ఇరాన్, బెలారస్, తుర్క్మెనిస్థాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, మంగోలియా, కజకిస్థాన్ దేశాలకు చెందిన 21 మంది ప్రముఖ మీడియా ప్రతినిధుల బృందం శిల్పారామాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
Similar News
News March 6, 2026
RR: మాస్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆరుగురు స్టూడెంట్స్

ఇంటర్మీడియట్ పరీక్షల్లో విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం నిఘా నీడలో ద్వితీయ సంవత్సర పరీక్షలు కొనసాగాయి. 67,578 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 66,491 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 1,087 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కాగా, ఒకే సెంటర్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఆరుగురు విద్యార్థులు స్క్వాడ్‌కు పట్టుబడ్డారు.
News March 4, 2026
RR: నిఘా నీడలో పరీక్షలు.. 1,916 మంది డుమ్మా

నిఘా నీడలో ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇవాళ ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు బుధవారం ఇంటర్ 2nd ఇయర్ పరీక్ష జరిగింది. రంగారెడ్డి జిల్లాలో 80,463 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. 78,547 మంది విద్యార్థులు హాజరయ్యారు. 1,916 మంది విద్యార్థులు వివిధ కారణాలతో హాజరు కాలేకపోయారు.
News March 3, 2026
రంగారెడ్డి జిల్లాలో ప్రధాన ఆలయాలు మూసివేత

పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా రంగారెడ్డి జిల్లాలోని ప్రధాన ఆలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ఫరూఖ్‌నగర్ మండంలోని ఉత్తరరామలింగేశ్వ రస్వామి, ఎలికట్ట అంబాభవానీ ఆలయాలు, చేవెళ్లలోని వేంకటేశ్వర ఆలయం, కడ్తాల్ మం.లోని మైసిగండి మైసమ్మతల్లి ఆలయం, నర్కుడలోని అమ్మపల్లి ఆలయ ద్వారాలు మూసివేశారు. గ్రహణం పూర్తయిన అనంతరం శుద్ధి చేసి తెరుస్తామన్నారు.


