News February 16, 2025
శివంపేట: చోరీ కేసులో నలుగురు అరెస్టు

శివంపేట మండలం పెద్ద గొట్టిముక్కుల గ్రామ శివారులోని భవ్యస్ ఫార్మసిటికల్ కంపెనీలో ఈనెల 15న జరిగిన చోరీ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. పరిశ్రమలో అర్ధరాత్రి వేళ ఇనుప సామాగ్రి చోరి చేయగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుమ్మడిదల గ్రామానికి చెందిన వెంకటేష్, ఆంజనేయులు, బ్రహ్మచారి, ధర్మేందర్లను అరెస్ట్ చేసి డిమాండ్‌కు తరలించారు.
Similar News
News February 20, 2025
మెదక్: ఢిల్లీ UPSCకి వెళ్లిన విద్యార్థి అదృశ్యం

మనోహరాబాద్ మండలం పోతారం గ్రామ యువకుడు అదృశ్యమైనట్లు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. మయూడి అనిల్ కుమార్ (28) ఈనెల 7న ఢిల్లీలో యుపీఎస్సీకి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. 11న కుటుంబీకులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో అతడి కోసం ఆరా తీశారు. ఆచూకీ లభించకపోవడంతో బుధవారం సోదరుడు నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
News February 20, 2025
మెదక్: ‘ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలి’

మెదక్ కలెక్టరేట్లో ఈ నెల 27న నిర్వహించే మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ, శాసన మండలి ఎన్నికల పోలింగ్ నిర్వహణపై ఎన్నికల పరిశీలకులు మహేశ్ దత్ ఎక్కా, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఎన్నికల విధులు నిర్వహించే వివిధ నోడల్ అధికారులతో సమీక్షించారు. ఎన్నికల విధులను నిజాయితీ నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆదేశించారు.
News February 20, 2025
మెదక్: స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

కేంద్రీయ విద్యాలయం నిర్మాణం చేపట్టడానికి అనువైన స్థలాన్ని గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులు ఆదేశించారు. బుధవారం హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, తహశీల్దార్ సింధు రేణుకతో కలిసి కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు.