News April 3, 2024

శివంపేట: భార్యతో గొడవ పడి ఇంట్లోంచి వెళ్లిపోయాడు !

image

మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతన్‌పల్లికి గ్రామానికి చెందిన అరికెల కృష్ణ(36) కనిపించకుండా పోయాడు. మంగళవారం భార్య అనితతో గొడవ పడిన కృష్ణ ఫోన్ ఇంట్లో పెట్టి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల వద్ద వెతికినా అతని ఆచూకీ లభించలేదు. దీంతో భార్య అనిత ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News December 17, 2025

మెదక్: ఈనెల 21న జాతీయ లోక్‌ అదాలత్‌

image

ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. నీలిమ పిలుపునిచ్చారు. న్యాయమూర్తులతో కలిసి ఆమె మాట్లాడారు. ఎక్కువ సంఖ్యలో రాజీ పడదగ్గ కేసులను పరిష్కరించి, కక్షిదారులకు సత్వర న్యాయం అందించేలా చొరవ చూపాలని సూచించారు. అందరూ సమన్వయంతో పనిచేసి లోక్ అదాలత్ ద్వారా గరిష్ఠ స్థాయిలో కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

News December 17, 2025

నర్సాపూర్ ఎమ్మెల్యే స్వగ్రామంలో కాంగ్రెస్ విజయం

image

శివంపేట మండలంలో గోమారం సర్పంచిగా కుమ్మరి హిమవతి ఆంజనేయులు విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి హిమవతి సమీప ప్రత్యర్థిపై గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కాగా, గోమారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్వగ్రామం.

News December 17, 2025

మెదక్: మండలాల వారీగా పోలింగ్ శాతం

image

మెదక్ జిల్లాలో మూడో విడత 7 మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగగా 90.68 శాతం ఓటింగ్ జరిగినట్లు జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తెలిపారు. ఒంటిగంట తర్వాత నమోదైన ఓటింగ్ శాతం.. చిలపిచెడు మండలంలో 90.02, కౌడిపల్లి 90.80, కుల్చారం 89.20, మాసాయిపేట 88.90, నర్సాపూర్ 93.38, శివంపేట 92.57, వెల్దుర్తి 87.62 శాతం ఓటింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు.