News April 29, 2024

శివంపేట: భార్య, కొడుకుతో గొడవపడి ఆత్మహత్య

image

మెదక్ జిల్లా శివంపేట మండలం లింగోజిగూడ తాండాకు చెందిన మాలోత్ విట్టల్ (48) ఈరోజు ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో భార్య, కొడుకుతో ఇంట్లో విషయమై గొడవపడ్డాడు. మనస్తాపానికి గురైన విఠల్ పొలం వద్దకు వెళ్లి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. శివంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 13, 2025

మెదక్: ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు: కలెక్టర్

image

మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. బుధవారం ఛాంబర్‌లో అధికారులతో సమీక్షించారు. అధికారులు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. ప్రస్తుతం వాతావరణం కొనుగోళ్లకు అనుకూలంగా ఉందని ఆయన తెలిపారు.

News November 12, 2025

మెదక్: ‘ఆన్లైన్‌లో సభ్యత్వ నమోదు చేసుకోండి’

image

జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు సభ్యత్వ నమోదు కోసం ఆన్లైన్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ పిలుపునిచ్చారు. మంగళవారం టీఎన్జీవో భవన్లో తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల జిల్లా ఫోరం సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆన్లైన్ పోర్టల్‌ను జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్‌తో కలిసి ప్రారంభించారు. తొలి సభ్యత్వాన్ని అందజేశారు.

News November 11, 2025

మెదక్: ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం

image

భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం ఆదర్శనీయమని అదనపు కలెక్టర్ నగేష్ కొనియాడారు. కలెక్టరేట్‌లో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఆజాద్ జయంతి వేడుక నిర్వహించారు. అదనపు కలెక్టర్ నగేష్, అధికారులు, సిబ్బంది ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆజాద్ జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు నగేష్ తెలిపారు.