News January 19, 2026
శివపార్వతుల నిత్య నివాసం, మోక్ష క్షేత్రం ‘వారణాసి’

పురాణాల ప్రకారం.. పార్వతీదేవి కోరిక మేరకు శివుడు కైలాసం వదిలి గంగాతీరంలోని కాశీని తన స్థిర నివాసంగా చేసుకున్నాడు. అందుకే కాశీ శివపార్వతుల గృహంగా, మోక్ష నగరంగా విరాజిల్లుతోంది. ఇక్కడి విశ్వనాథ జ్యోతిర్లింగ దర్శనం పాపాలను తొలగిస్తుందని నమ్మకం. జీవన్మరణాల సంగమమైన ఈ క్షేత్రంలో మరణించిన వారికి శివుడు స్వయంగా మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందుకే భారతీయ సంస్కృతిలో కాశీకి అత్యంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది.
Similar News
News February 25, 2026
వృద్ధులు, మహిళలకు త్వరలోనే శుభవార్త!

TG: ఎన్నికల హామీల్లో మిగిలిన వాటినీ అమలు చేసేలా కొత్త స్కీమ్‌లపై GOVT దృష్టి సారించింది. వృద్ధాప్య పెన్షన్ ₹4000కు పెంపు, మహిళలకు ₹2500 సాయం, విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్ స్కీమ్‌లకు నిధుల అందుబాటుపై ఆర్థిక శాఖ ఇప్పటికే CMకు నివేదించింది. రానున్న బడ్జెట్లో వీటిని ప్రకటించనున్నట్లు సమాచారం. వీటికోసం ఆయా శాఖలు అందించే ప్రతిపాదనలపై బడ్జెట్ సమావేశాలకు ముందు క్యాబినెట్లో తుది నిర్ణయం తీసుకుంటారు.
News February 25, 2026
ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు

ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి గడువును పెంచారు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ(MBA/PGDBA/PGDBM/MMS), ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో పాటు ICAIలో సభ్యత్వం ఉన్న అభ్యర్థులు మార్చి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.eximbankindia.in
News February 25, 2026
‘పాల’కూట విషం.. ‘జలం’ కలుషితం.. బతికేదెలా?

తెల్లనివన్నీ పాలు.. నల్లనివన్నీ నీళ్లు అనుకుంటే పొరపాటే. కల్తీరాయుళ్లు పాలనూ విషతుల్యం చేసేస్తూ ప్రజల ప్రాణాలను పీల్చేస్తున్నారు. అటు ప్రాణాధారమైన మంచి నీళ్లు డ్రైనేజీ వాటర్‌తో కలుషితమవుతున్నాయి. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. APలోని <<19230296>>రాజమండ్రి, శ్రీకాకుళం<<>> ఉదంతాలే ఇందుకు నిదర్శనం. ఈ ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కొరడా ఝుళిపించాల్సి ఉంది.


