News February 13, 2026

శివయ్య చేతిలో త్రిశూలం ఎందుకు?

image

శివుని చేతిలోని త్రిశూలం సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీక. ఈ 3 శక్తులు ఆయన ఆధీనంలో ఉంటాయని, వాటిని సమన్వయం చేస్తూ ఆయన సృష్టిని నడిపిస్తారని అర్థం. అలాగే జ్ఞానం, ఇచ్చాశక్తి, క్రియాశక్తిని సూచిస్తుంది. భక్తుల హృదయాల్లోని అజ్ఞానాన్ని నశింపజేసి, పరిపూర్ణంగా ఆధ్యాత్మికత వైపు నడిపిస్తుంది. అంతటి శక్తి త్రిశూలానికి ఉంటుంది. ఇది మానవునిలోని అరిషడ్వర్గాలను జయించి, ముక్తిని పొందే మార్గాన్ని బోధిస్తుంది.

Similar News

News February 14, 2026

మున్సిపల్ ఫలితాలపై సీఎం కీలక సమావేశం

image

TG: మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడటంతో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చిస్తున్నారు. ఎక్స్ అఫీషియో ఓట్లపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఎల్లుండి మేయర్, ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది.

News February 14, 2026

ఇన్‌స్టాగ్రామా.. ఛేంజింగ్ రూమా?

image

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాలో అశ్లీలం హద్దుమీరింది. ముఖ్యంగా ఇన్‌ఫ్లుయెన్సర్ల పేరిట కొందరు అమ్మాయిలు ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారు. లైక్‌ల కోసం డ్రెస్ ఛేంజింగ్ వీడియోలను ఇన్‌స్టాలో పంచుకుంటున్నారు. ‘మరింత’ చూపిస్తామంటూ సబ్‌స్క్రిప్షన్ పేరిట బరితెగిస్తున్నారు. ప్రైవసీకి సంబంధించిన దృశ్యాలు ఇలా బజార్లో పెడుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి వీడియోలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.

News February 14, 2026

నేషనల్ షుగర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

నేషనల్ షుగర్ ఇన్‌స్టిట్యూట్ 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, ఇంటర్, టెన్త్ అర్హతగల వారు మార్చి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nsi.gov.in