News February 8, 2026

శివరాత్రి బ్రహ్మోత్సవాలకు జిల్లా కలెక్టర్, ఎస్పీకీ ఆహ్వానం

image

శ్రీశైలంలో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారిని దేవస్థానం అధికారులు ఆహ్వానించారు. శనివారం కలెక్టరేట్‌లో ఆమెను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్‌ను కలిసి బ్రహ్మోత్సవాల పత్రికతో పాటు మల్లన్న ప్రసాదాన్ని అందజేసి ఆహ్వానించారు.

Similar News

News April 5, 2026

బంగ్లాదేశ్ సరిహద్దులో పాములు, మొసళ్లతో రక్షణ!

image

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు రక్షణ కోసం మొసళ్లు, విషపూరితమైన పాములను ఉంచాలని BSF యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫెన్సింగ్ వేయడం సాధ్యం కాని 175 కి.మీ మేర వీటితో రక్షణ కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే BSFకు సిబ్బంది కొరత ఉండగా ఆ సమస్య కూడా తీరుతుందని భావిస్తున్నారు. కాగా బంగ్లాతో మనకు 4,096 KM సరిహద్దు ఉండగా ఇప్పటివరకు 3,240 KM మేర ఫెన్సింగ్ వేశారు.

News April 5, 2026

తిరుపతి జిల్లాలో మర్డర్!

image

చంద్రగిరి(M) రామిరెడ్డిపల్లెలోని ఓ ప్రైవేట్ కాలేజీ సమీపంలో డెడ్ బాడీ కలకలం రేపింది. మృతుడిని తిరుపతి రైల్వే కాలనీకి చెందిన టాక్సీ డ్రైవర్ శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు. ​మార్చి 28న తనపల్లి వద్ద 8 మంది స్నేహితులతో కలిసి శ్రీనివాసులు మద్యం సేవించినట్లు తెలుస్తోంది‌‌. ఆ సమయంలో తలెత్తిన గొడవలో స్నేహితులే హతమార్చి, మృతదేహాన్ని రామిరెడ్డిపల్లె సమీపంలో పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు‌.

News April 5, 2026

ASF రవాణా శాఖకు రూ.549 లక్షల ఆదాయం

image

ASF జిల్లాలో రవాణా శాఖ 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు రూ.624 లక్షల లక్ష్యాన్ని నిర్దేశించగా, రూ.549.43 లక్షల ఆదాయం సాధించింది. దీంతో 87.84 శాతం లక్ష్యం నెరవేరినట్లు అధికారులు తెలిపారు. ఈ కాలంలో మొత్తం 99,967 వాహనాలు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. వాహనాల సంఖ్య పెరగడంతో రిజిస్ట్రేషన్లు కూడా పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. లక్ష్యం పూర్తిగా చేరకపోయినా గత ఏడాదితో పోలిస్తే ఆదాయం పెరిగిందన్నారు.