News December 31, 2025

శివలింగం ధ్వంసంపై ‘అచ్చెన్న’ ఆగ్రహం.. నిందితులను వదలొద్దు!

image

ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం ఘటనపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం అధికారులను ఆరా తీశారు. కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఆయన.. దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. హిందూ దేవాలయాలపై దుశ్చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక కేంద్రాల వద్ద భద్రతను పెంచాలని సూచించారు.

Similar News

News January 6, 2026

పాలమూరు: TGలో టాప్-5.. మనోళ్లే..!

image

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి సైబర్ నేరాలపై అవగాహన, బాధితులకు రిఫండ్‌ల సాధనలో ఉత్తమ సేవలు అందించిన టాప్-5 సైబర్ వారియర్స్‌లను ఎంపిక చేయగా.. అందులో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ముగ్గురు పోలీస్ కానిస్టేబుళ్లు ఎంపిక కావడం గర్వకారణంగా నిలిచింది.
1.ఎం.మధు గౌడ్(MBNR రూరల్ పీఎస్)
2.వికాస్ రెడ్డి(MBNR-వన్ టౌన్ పీఎస్)
3.శ్రీనివాసులు(దేవరకద్ర పీఎస్)

News January 6, 2026

రైల్‌వన్ యాప్‌తో టికెట్లపై డిస్కౌంట్

image

ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. రైల్‌వన్ యాప్ ద్వారా అన్‌రిజర్వుడ్ టికెట్లు కొనుగోలు చేస్తే 3% ప్రత్యేక డిస్కౌంట్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ జనవరి 14 నుంచి జులై 14 వరకు అమల్లో ఉంటుంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రైల్‌వన్ యాప్ ద్వారా రిజర్వుడు, అన్‌రిజర్వుడ్‌తో పాటు ప్లాట్‌ఫాం టికెట్లు కూడా సులభంగా పొందవచ్చన్నారు.

News January 6, 2026

నేడు ఇలా చేస్తే.. గణపతి కటాక్షం, సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం

image

నేడు అత్యంత ప్రభావవంతమైన అంగారక సంకటహర చతుర్థి. ఈరోజు గణేశుణ్ని పూజిస్తే సంకటాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. అలాగే మంగళవారానికి అధిపతి అయిన కుమార స్వామి అనుగ్రహం పొందవచ్చని పండితులు చెబుతున్నారు. ఈ శుభదినాన ఇద్దరు శివపుత్రులను కలిపి పూజించి వ్రతం ఆచరిస్తే ఆర్థిక, వివాహ, సంతాన సమస్యలు తొలగిపోతాయని, పిల్లలకు ఏకాగ్రత, జ్ఞానం పెరుగుతుందని సూచిస్తున్నారు. ఈ వ్రత విధానం కోసం క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.