News December 24, 2025
శివాజీ కామెంట్స్.. నిధి అగర్వాల్ సంచలన పోస్ట్!

హీరోయిన్ నిధి ఇన్‌స్టాలో తాజాగా పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. లులు మాల్ ఈవెంట్‌లో దిగిన ఫొటోను స్టోరీగా పెట్టి ‘బాధితురాలిని నిందిస్తూ సానుభూతి పొందడం సరికాదు’ అని క్యాప్షన్ ఇచ్చారు. నటుడు శివాజీ కామెంట్స్‌ను ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. నిధి డ్రెస్ జారిపోతే పరిస్థితి ఎలా ఉండేదని, ఆమె పడిన ఇబ్బంది తనను ప్రొవోక్ చేయడం వల్లే దుస్తులపై కామెంట్స్ చేశానని శివాజీ అన్నారు.
Similar News
News December 25, 2025
ENG టీమ్ హెడ్ కోచ్‌గా రవిశాస్త్రిని నియమించాలి: మాజీ క్రికెటర్

యాషెస్ సిరీస్ ఓటమితో ఇంగ్లండ్ క్రికెట్‌లో మార్పులు అవసరమని మాజీ క్రికెటర్ మోంటీ పనేసర్ సూచించారు. మెక్‌కల్లమ్ స్థానంలో రవిశాస్త్రిని ENG టీమ్ హెడ్ కోచ్‌గా నియమించాలన్నారు. ‘మానసికంగా, వ్యూహాత్మకంగా ఆస్ట్రేలియాను ఎలా ఓడించాలో తెలిసిన వారినే హెడ్‌కోచ్‌గా నియమించాలి. దానికి సరైన వ్యక్తి రవిశాస్త్రి. ఆయన గైడెన్స్‌లో 2018-19, 2020-21లో AUSపై IND టెస్ట్ సిరీస్‌లు గెలిచింది’ అని చెప్పారు.
News December 25, 2025
రేపు బాక్సింగ్ డే.. సెలవు

రేపు (డిసెంబర్ 26) బాక్సింగ్ డే సందర్భంగా తెలంగాణలో పబ్లిక్ హాలిడే ప్రకటించారు. దీంతో అన్ని రకాల స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. అటు ఏపీలో రేపు ఆప్షనల్ హాలిడే ఉంది. కొన్ని స్కూళ్లు సెలవు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక శనివారం, ఆదివారం కూడా సెలవులు కావడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు.
News December 25, 2025
దేశంలో లక్షకు పైగా పెట్రోల్ పంప్స్

ఇండియా ఇంధన రిటైల్ మార్కెట్ చైనా, US తరువాత 3వ స్థానాన్ని ఆక్రమించింది. పదేళ్లలో అవుట్‌లెట్‌లు రెట్టింపై 1,00,266కు చేరాయి. ఇందులో 29% రూరల్ ఏరియాలోనే ఉన్నాయి. దీంతో కస్టమర్లకు మెరుగైన సేవలందుతున్నాయని IOL మాజీ ఛైర్మన్ అశోక్ తెలిపారు. పెట్రోల్, డీజిల్ సహా CNG, EV ఛార్జింగ్ స్టేషన్స్ వంటివీ అందుబాటులోకి వచ్చాయి. కాగా ఈ అంశంలో రిలయన్స్, నయారా వంటి ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం 10% లోపే ఉంది.


