News February 19, 2025
శివాజీ జయంతి: హోరెత్తనున్న నల్గొండ

హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన వీరుడు, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ 398వ జయంతి ఉత్సవాలకు నల్గొండ ముస్తాబైంది. పల్లెపల్లెనా, మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున ర్యాలీలు తీసేందుకు ఇప్పటికే ఏర్పాట్లుచేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో శివాజీ మహారాజ్ శోభాయాత్ర ఉంటుందని హిందూవాహినీ సభ్యులు తెలిపారు. రామగిరి రామాలయం నుంచి సాయంత్రం 4 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
Similar News
News February 21, 2025
NLG: ‘ఈసారి ఓవర్ లోడ్ సమస్యలే లేవు’

వేసవిలో విద్యుత్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని దక్షిణ తెలంగాణ పంపిణి సంస్థ సీఎండి ముషారఫ్ ఫరూకీ ఆదేశించారు. గురువారం ఆయన NLG కలెక్టర్ కలెక్టరేట్లో విద్యుత్ సరఫరాకు సంబంధించి “వేసవి కార్యాచరణ ప్రణాళిక” పై సమీక్ష నిర్వహించారు. గతేడాది FEB 20 నాటికి జిల్లాలో 66 సబ్ స్టేషన్‌లపై ఓవర్ లోడ్ ఉండేదని.. ఈసారి ఒక సబ్ స్టేషన్లో కూడా ఓవర్ లోడ్ లేదని తెలిపారు.
News February 21, 2025
వేసవి కార్యాచరణ ప్రణాళికపై కలెక్టర్ సమీక్ష

గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం జిల్లాలో తాగునీటికి సమస్యలు రాకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎంపీడీవోలు, తహశీల్దారులను ఆదేశించారు. గురువారం ఆమె ఉదయాదిత్య భవన్లో తహశీల్దారులు, ఎంపీడీవోలతో వేసవి కార్యాచరణ ప్రణాళిక పై సమీక్ష నిర్వహించారు. ఎక్కడైనా తాగునీటి పైపులు, నల్లాలు తదితర అత్యవసర మరమ్మతులు ఉన్నట్లయితే గ్రామపంచాయతీ నిధుల నుంచి చేయించాలని ఆదేశించారు.
News February 20, 2025
పెద్దగట్టు జాతరకు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం

సూర్యాపేట జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇద్దరు యువకులు పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు బైక్‌పై వెళ్లి వస్తుండగా సూర్యాపేట రూరల్ పరిధి కేసారం గ్రామం సమీపంలోని వాగులో పడ్డారు. ఈ ప్రమాదంలో కాసరాబాద్ గ్రామానికి చెందిన సుధీర్(21) మృతి చెందగా, సంపత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుణ్ని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.