News February 15, 2026

శివాలయాల్లో MP పార్థసారథి పూజలు

image

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని హిందూపురం ఎంపీ BK పార్థసారథి పెనుగొండలోని పలు శివాలయాలను దర్శించుకున్నారు. పట్టణంలోని ముక్తేశ్వరాలయం, నాగేశ్వరాలయం, కాశీ విశ్వేశ్వర ఆలయాలతో పాటు భోగసముద్రంలోని యోగేశ్వర స్వామి దేవస్థానంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు సాయి కళ్యాణ్, శశిభూషణ్ పటేల్, గాడి మల్లికార్జున యాదవ్ తదితర టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Similar News

News February 16, 2026

అల్లూరి: హాల్ టికెట్స్ ఆపితే కఠిన చర్యలు

image

అల్లూరి, పోలవరం జిల్లాల్లో ఈనెల 23 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని ఇంటర్ పరీక్షల జిల్లా అధికారి భీమశంకరరావు సోమవారం తెలిపారు. ఈ జిల్లాల్లో 26 కేంద్రాల్లో 14,166 మంది పరీక్షలు రాస్తున్నారన్నారు. ఫీజులు చెల్లించలేదని హల్ టికెట్స్ నిలిపి వేస్తే కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇబ్బందులుంటే కంట్రోల్ రూం నెంబర్‌కు 9493259259 తెలియజేయాలని సూచించారు.

News February 16, 2026

17న డీ వార్మింగ్ డే: GNT DMHO

image

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం (డీ వార్మింగ్ డే)ను ఈ నెల 17వ తేదీన నిర్వహిస్తున్నట్లు DMHO విజయ లక్ష్మి  తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంపై సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని అంగన్వాడీలు, పాఠశాలలు, కళాశాలల్లో 17వ తేదీన ఉచితంగా ఇవ్వబడే అల్బెండజోల్ 400 మిల్లీ గ్రాముల మాత్ర ద్వారా నులిపురుగుల సంక్రమణను సులభంగా నిర్మూలించవచ్చన్నారు.

News February 16, 2026

మహిళలూ ఒంటరిగా ప్రయాణిస్తున్నారా?

image

ప్రస్తుతకాలంలో వృత్తి, ఉద్యోగాల కారణంగా మహిళలు క్యాబ్స్‌లో ప్రయాణించడం ఎక్కువైంది. ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. డ్రైవర్ ఐడీ, లైసెన్స్ ప్లేట్ మీరు బుక్ చేసిన డేటాతో సరిపోలాలి. ట్రిప్ వివరాలు, లైవ్ ట్రాకింగ్‌ సన్నిహితులకు పంపడం మంచిది. గుర్తింపు ఉన్న క్యాబ్ సర్వీసులనే ఎంచుకోవాలి. పరిసరాలు గమనిస్తూ అలర్ట్‌గా ఉండాలి. వెనుక సీట్‌లోనే కూర్చోవాలి. తెలియనివారికోసం డోర్లు తెరవకూడదు.