News February 12, 2026

శివ నామాలు అర్థాలు ‘‘త్రినేత్ర’’

image

శివుడి కుడి కన్ను సూర్యుడిని, ఎడమ కన్ను చంద్రుడిని సూచిస్తుంది. ‘జ్ఞాన నేత్రం’ అని పిలిచే మూడో కన్ను అగ్నిని సూచిస్తుంది. సాధారణ కళ్లు భౌతిక ప్రపంచాన్ని మాత్రమే చూస్తాయి. కానీ, మూడో కన్ను అంతరాత్మను, సత్యాన్ని దర్శిస్తుంది. అజ్ఞానాన్ని దహించివేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అంతటి శక్తి ఆ నేత్రమయం. అందుకే ఆయనను ముక్కంటి/త్రినేత్రుడు అంటారు. కామదహనంలో ఆయన తన మూడో కంటితోనే మన్మథుడిని భస్మం చేశాడు.

Similar News

News February 12, 2026

రాహుల్ సభ్యత్వం రద్దుకై BJP MP తీర్మానం

image

రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయాలని తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు BJP MP నిషికాంత్ దూబే తెలిపారు. ఈ మేరకు స్పీకర్‌కు ప్రతిపాదించారు. దీనిపై చర్చ జరిగి, ప్రభుత్వం ఓటింగ్ పెడితే సభ్యత్వం కోల్పోవచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు. కాగా ఒక అంశం/అభిప్రాయం/నిర్ణయంపై చర్చించాలని సభ్యులు సొంతంగా ప్రవేశపెట్టే తీర్మానాలను స్వతంత్ర తీర్మానం (Substansive Motion) అంటారు. దీనిపై చర్చపై స్పీకర్‌దే తుది నిర్ణయం.

News February 12, 2026

కొలికపూడిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆగ్రహం?

image

AP: ఎంపీ కేశినేని చిన్నీపై ఆరోపణలు, ప్రభుత్వంపై పరోక్ష విమర్శలతో తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు నిత్యం <<19095636>>వివాదాల్లో<<>> ఉంటున్నారు. దీంతో అసెంబ్లీ లాబీలో కొలికపూడితో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ భేటీ అయ్యారు. క్రమశిక్షణ దాటితే ఉరుకునేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. అనుభవరాహిత్యంతో పొరపాట్లు జరుగుతున్నాయని, సీనియర్లు మార్గనిర్దేశం చేయాలని కొలికపూడి కోరినట్లు తెలుస్తోంది.

News February 12, 2026

సరికొత్త రోల్‌లో మైక్ టైసన్

image

జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ సరికొత్త రోల్‌లో కనిపించనున్నారు. ట్రంప్ ప్రభుత్వంలో ‘హెల్తీ ఈటింగ్’ అంబాసిడర్‌గా పనిచేయనున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ‘నా సోదరి ఊబకాయంతో 25 ఏళ్లకే మరణించింది. నేను కూడా బాల్యంలో జంక్ ఫుడ్ వల్ల 156KGల బరువుతో ఇబ్బందిపడ్డా. సూసైడ్ చేసుకోవాలనుకున్నా. మంచి ఆరోగ్యం కోసం అల్ట్రా ప్రాసెస్డ్ కాకుండా రియల్ ఫుడ్ తినండి’ అని పిలుపునిచ్చారు.