News April 8, 2025
శిశు మరణాల రేటు తగ్గించడమే లక్ష్యంగా పనిచేయాలి: కలెక్టర్

శిశు మరణాల రేటు తగ్గించడమే ఆరోగ్యశాఖ ముఖ్య లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య శాఖ అధికారులతో నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. గర్భిణీలకు ప్రసవం జరిగే వరకు ఆరోగ్య కార్యకర్తలు సూచనలను సలహాలు ఇచ్చి తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం కృషి చేయాలన్నారు. సదస్సులో జిల్లా వైద్యాధికారి కోటచలం సిబ్బంది ఉన్నారు.
Similar News
News February 28, 2026
VKB జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన దీపక్ తివారి

వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా దీపక్ తివారి బాధ్యతలు స్వీకరించారు. శనివారం జిల్లా అధికారులు నూతన కలెక్టర్‌కు స్వాగతం పలికారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తూ పరిపాలన యంత్రాంగాన్ని సరైన విధంగా నడిపిస్తామని తెలిపారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామంటూ అధికారులంతా కలిసికట్టుగా పని చేయాలని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు.
News February 28, 2026
పెద్దపల్లి: దానాపూర్‌కు హోలీ స్పెషల్ ట్రైన్

చర్లపల్లి-దానాపూర్ మధ్య హోలీ స్పెషల్ ట్రైన్ నడుపనున్నట్లు SCR అధికారులు పేర్కొన్నారు. రైలు నం.07097 నేడు 20:30 గంటలకి చర్లపల్లిలో బయలుదేరి కాజీపేట, రామగుండం, బల్హర్షా, నాగపూర్, ప్రయాగ్రాజ్ మీదుగా మార్చి 2న ఉదయం 9:30గంటలకు దానాపూర్ చేరుతుందన్నారు. అదే రోజు ఉదయం 11:30గంటలకు దానాపూర్ నుండి రైలు నం.07098 బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11:45కి చర్లపల్లి చేరుతుందన్నారు. రామగుండంలో ఈ ట్రైన్ ఆగుతుంది.
News February 28, 2026
జగిత్యాల: ‘పుష్కరాల పనులకు మార్పులు చేర్పులు చేపట్టాలి’

త్వరలో జరగనున్న గోదావరి పుష్కరాలకు అధికారులు తయారుచేసిన పనుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాలకు బాసర నుంచి భద్రాచలం వరకు నిధులు కేటాయిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపినట్లు మంత్రి అన్నారు. గతంలో 50 లక్షల మంది భక్తులకు పుణ్య స్థానాలకు ఏర్పాటు చేశారని, కానీ 2027 పుష్కరాలకు నాలుగు కోట్ల భక్తులకు ఏర్పాటు చేయాలని తెలిపారు.


