News December 21, 2025
శీతాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

సాధారణంగా శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి పాలకూర, బీట్‌రూట్, గుడ్లు, చేపలు, చికెన్ పాలు, పెరుగు వంటి ఇనుము, బి12 అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అల్లం, వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవడం వల్ల జీవక్రియ పెరిగి శరీరం వెచ్చగా ఉంటుంది. బాదం, వాల్‌నట్స్, ఖర్జూరం శక్తిని అందిస్తాయి. జీలకర్ర, పసుపు, నల్ల మిరియాలు వంటివి శరీరం లోపల నుండి వెచ్చగా ఉంచడానికి సహాయపడతాయి.
Similar News
News December 27, 2025
లవ్లీ హోం హ్యాక్స్

* తలుపులు, గోడలమీద అంటించిన స్టిక్కర్ల మరకలు త్వరగా వదలాలంటే ముందుగా యూకలిప్టస్ ఆయిల్ రాసి తరువాత శుభ్రపరిస్తే సరిపోతుంది.
* గది తాజా పరిమళాలు వెదజల్లాలంటే వెనిగర్‌ని స్ప్రే చేయాలి.
* కత్తెర మొద్దుబారినప్పుడు అల్యూమినియం ఫాయిల్ చిన్న చిన్న ముక్కలుగా కత్తిరిస్తే పదునెక్కుతుంది.
* వంటగది మూలల్లో బోరిక్ పౌడర్ వేసి ఉంచితే, బొద్దింకలు ఆ దరిదాపులకి రావు.
News December 27, 2025
ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు?

TG: ఫిబ్రవరి రెండో వారం నాటికి మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో GHMCతో కలిపి 8 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో చాలా వాటికి ఈ ఏడాది జనవరిలోనే గడువు ముగిసింది. GHMCతో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల గడువు 2026 ఫిబ్రవరితో ముగియనుంది. అటు జనవరి రెండో వారం నాటికి తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు ఎన్నికల సంఘం కార్యాచరణ రూపొందించింది.
News December 27, 2025
సాగుభూమి సంరక్షణ వ్యవసాయంలో కీలకం

సాగు భూములకు రసాయనాల వాడకం తగ్గించడం, సేంద్రియ ఎరువుల వాడకం పెంచడం, పంట మార్పిడి, మిశ్రమ పంటల సాగు, సంప్రదాయ, దేశవాళీ పంట రకాల పెంపకం, నేలకోత నివారణ చర్యలు, నేలను కప్పి ఉంచడం వంటి చర్యలతో నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, పంటల అవశేషాలు, జీవన ఎరువులు, పశువుల వ్యర్థాలు, వర్మీకంపోస్టు వంటి సేంద్రియ ఎరువుల వాడకం వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది.


