News January 8, 2026

శీతాకాలంలో గర్భిణులకు ఈ జాగ్రత్తలు

image

చలికాలంలో దాహం వేయట్లేదని నీరు తక్కువగా తాగుతారు. దీనివల్ల ఉమ్మనీరు తగ్గడంతో పాటు డెలివరీ తర్వాత పాలు కూడా తక్కువగా వస్తాయి. అలాగే గర్భిణులు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి. సి విటమిన్ పుష్కలంగా ఉండే ఉసిరికాయలు, ఇతర పండ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతోపాటు బచ్చలికూర, మెంతి ఆకు, ఉల్లిపాయ ఆకులు వంటి కూరగాయలు కూడా ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Similar News

News February 21, 2026

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ: ఇంటర్ బోర్డు

image

AP: ఈ నెల 23 నుంచి జరగనున్న ఇంటర్ పరీక్షలకు 1,537 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఉ.9 గంటలకు పరీక్షలు ప్రారంభం కానుండగా, నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఎగ్జామ్ హాలులోకి అనుమతించబోమని పేర్కొంది. ఫస్ట్, సెకండియర్ కలిపి 10,57,312 మంది ఎగ్జామ్స్ రాయనున్నారు.

News February 21, 2026

మెటర్నిటీ లీవ్‌ గురించి తెలుసా?

image

మెటర్నిటీ బెనిఫిట్‌ యాక్ట్‌ 1961 ప్రకారం, పని చేసే మహిళలకు గర్భం దాల్చిన సమయంలో ప్రత్యేకహక్కులు ఉన్నాయి. మొదటి ఇద్దరు పిల్లలకు 26 వారాల పెయిడ్‌ లీవ్స్‌ అందించాలి. తదుపరి పిల్లలకు 12 వారాల పెయిడ్‌ లీవ్స్‌ ఇవ్వాలి. మూడు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న బిడ్డను దత్తత తీసుకున్నప్పుడు లేదా సరోగసీ పేరెంట్స్ కూడా 12 వారాల సెలవు పొందవచ్చు. ఈ లీవ్స్‌ తీసుకున్నందుకు కంపెనీలు మహిళలను ఉద్యోగం నుంచి తొలగించలేవు.

News February 21, 2026

గ్రాండ్ నైన్(జీ9) కంటే కావేరీ వామన్ ఎందుకు ప్రత్యేకం?

image

దేశంలో ప్రస్తుతం గ్రాండ్‌ నైన్‌(G9) అరటి ఎక్కువగా సాగులో ఉంది. ఈ చెట్టు ఎత్తు 6–8 అడుగులు. పంట కాలం 11–12 నెలలు. దీని ఎత్తు ఎక్కువ కావడం వల్ల తీవ్ర గాలులకు ఒరిగి/విరిగి రైతులు నష్టపోతున్నారు. దీనికి ఊత కర్రలను సైతం అమర్చుకోవడానికి అదనపు ఖర్చవుతోంది. కావేరి వామన్ రకం 4.9-5.25 అడుగులే ఉండటం వల్ల గాలులను తట్టుకుంటుంది. ఊత కర్రల అవసరం ఉండదు. ఈ చెట్ల గెలలు G9 కంటే నెల ముందే కోతకు రావడం అదనపు లాభం.