News February 21, 2025
శుక్రవారం: HYDలో మళ్లీ తగ్గిన చికెన్ ధరలు

HYDలో చికెన్ ధరలు మళ్లీ తగ్గాయి. గురువారం KG స్కిన్‌లెస్ రూ.186, విత్ స్కిన్ రూ.164 చొప్పున అమ్మకాలు జరిపారు. నేడు ఏకంగా KG మీద రూ.15 నుంచి రూ.18 వరకు తగ్గించారు. శుక్రవారం KG స్కిన్ లెస్ రూ.168, KG విత్ స్కిన్ రూ.148గా ధర నిర్ణయించారు. కొన్ని హోల్ సేల్ దుకాణాల్లో రూ. 160కే అమ్మకాలు జరుపుతున్నారు. రిటైల్ షాపుల్లో మాత్రం ధరలు యథావిధిగా ఉంటున్నాయి. మీ ఏరియాలో KG చికెన్ ఎంత?
Similar News
News February 22, 2025
కీసరగుట్ట జాతర.. 2,000 మందితో బందోబస్తు!

కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల కోసం కట్టుదిట్టంగా భద్రతను చేపడుతున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సుమారు 2,000 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు CP పేర్కొన్నారు. ఆలయం వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
News February 22, 2025
HYD: బీజేపీ, బీఆర్ఎస్ బీసీ ద్రోహుల పార్టీలు: అద్దంకి

బీజేపీ, బీఆర్ఎస్ బీసీ ద్రోహుల పార్టీలు అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు సంబంధించి దేశంలో ఇంత పెద్ద ఎత్తున విప్లవం వస్తున్న క్రమంలో.. ఎందుకు బీజేపీ బీసీలకు రిజర్వేషన్ల గురించి ఆలోచించదని ప్రశ్నించారు. బీసీలకు రిజర్వేషన్లు సాధించడమే రాహుల్ గాంధీ జీవిత లక్ష్యమని వివరించారు.
News February 21, 2025
వివిధ కోర్సుల పరీక్ష ఫీజు స్వీకరణ

ఓయూలోని వివిధ సైకాలజీ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ, ఎంఫిల్ ఇన్ రిహబిలిటేషన్ సైకాలజీ కోర్సుల మొదటి సెమిస్టర్, పీఎస్వై క్లినికల్ సైకాలజీ మొదటి సంవత్సరం, ప్రొఫెషనల్ డిప్లమా ఇన్ క్లినికల్ సైకాలజీ రెగ్యులర్ పరీక్షా ఫీజును వచ్చే నెల 7వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. రూ. 200 అపరాధ రుసుముతో 12వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు.