News January 25, 2026
శుభాంశు శుక్లాకు అశోక చక్ర

77వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా 70 మంది సాయుధ దళాల సిబ్బందికి శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ముర్ము ప్రకటించారు. గతేడాది అంతరిక్ష యాత్ర పూర్తి చేసిన శుభాంశు శుక్లా(పైలట్)కు అశోక చక్ర అవార్డు వరించింది. ముగ్గురికి కీర్తి చక్ర, 13 మందికి శౌర్య చక్ర, ఒకరికి బార్ టు సేనా మెడల్(గ్యాలంటరీ), 44 మందికి సేనా మెడల్, ఆరుగురికి NAO సేనా మెడల్, ఇద్దరికి వాయు సేనా మెడల్ అందించనున్నారు.
Similar News
News February 25, 2026
విమాన ప్రయాణం సేఫ్.. DGCA కొత్త రూల్స్!

విమాన ప్రమాదాలు పెరుగుతుండటంతో DGCA రూల్స్ మార్చేసింది. చార్టర్డ్ విమానాల ఓనర్లు వెబ్‌సైట్‌లో విమాన వయసు, పైలట్ ఎక్స్‌పీరియన్స్ వంటి వివరాలన్నీ పెట్టాలి. సేఫ్టీ విషయంలో పైలట్లనే కాకుండా పైఅధికారులనూ బాధ్యుల్ని చేస్తారు. రూల్స్ బ్రేక్ చేస్తే పైలట్ లైసెన్స్ ఐదేళ్ల వరకు కట్ అవుతుంది. వాతావరణం బాగోకపోతే విమానం ఆపేసే పవర్ పైలట్‌కు ఇచ్చారు. ఆపరేటర్లు రియల్ టైమ్ వెదర్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
News February 25, 2026
5 OTTలను బ్యాన్ చేసిన కేంద్రం

అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న 5 OTT యాప్స్‌పై కేంద్రం వేటు వేసింది. MoodXVIP, Koyal Playpro, Digi Movieplex, Feel, Jugnu అనే ప్లాట్‌ఫామ్‌లను బ్లాక్ చేసింది. అసభ్యకరమైన వీడియోలతో యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయనే ఫిర్యాదులతో IT రూల్స్ 2021 ప్రకారం ఈ చర్యలు తీసుకుంది. ఇకపై ఇవి ఇండియాలో పనిచేయవు.
News February 25, 2026
విజయానికి నాలుగు సూత్రాలు

కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకః|
మౌనేన కలహో నాస్తి నాస్తి జాగరతో భయః|
మనది వ్యవసాయాధారిత దేశం కాబట్టి సాగును నమ్ముకుంటే ఆకలి చావులు ఉండవని ఈ శ్లోకం చెబుతోంది. శ్లోకార్థం: కృషి ఉంటే కరవు ఉండదు. జపం చేస్తే పాపాలు నశిస్తాయి. మౌనం వహిస్తే కలహాలు రావు. అప్రమత్తంగా ఉంటే భయం ఉండదు.


