News June 22, 2024
శుభ ముహూర్తం

తేది: జూన్ 22, శనివారం జ్యేష్ఠమాసం
శు.పౌర్ణమి: ఉ.06:37 గంటలకు
బ.పాడ్యమి: ఉ.05:13 గంటలకు
మూల: సా.05:54 గంటలకు
దుర్ముహూర్తం: ఉ.05:36-07:21 గంటల వరకు
వర్జ్యం: సా.04:20-05:54 గంటల వరకు
Similar News
News November 6, 2025
రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు?

AP: రాష్ట్రంలో కొత్తగా 2 జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం, చిత్తూరు జిల్లాలోని మదనపల్లె కేంద్రాలుగా జిల్లాలు ఏర్పాటుకానున్నట్లు సమాచారం. అలాగే నక్కపల్లి, అద్దంకి, మడకశిర, బనగానపల్లె, పీలేరు, అవనిగడ్డ, గిద్దలూరు పట్టణాలను రెవెన్యూ డివిజన్లుగా మార్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
News November 6, 2025
జీరో టిల్లేజి సాగు విధానం – ఏ పంటలకు అనుకూలం?

వరి కోత యంత్రంతో పైరును కోశాక దుక్కి చేయకుండా ఇతర పంట విత్తనాలను విత్తే పద్ధతిని జీరో టిల్లేజి సాగు పద్ధతి అంటారు. ఇది మొక్కజొన్న, ఆముదం, పొద్దుతిరుగుడు, శనగకు అనుకూలం. ఈ పద్ధతిలో విత్తేటప్పుడు చాలినంత తేమ నేలలో లేకపోతే ఒక తడి ఇచ్చి విత్తుకొవడం మంచిది. విత్తనాలను చేతితో విత్తే పరికరాలతో నాటితే సమయం ఆదా అవుతుంది. వరుసకు వరుసకు మధ్య 60 సెం.మీ, మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ ఉండేట్లు విత్తుకోవాలి.
News November 6, 2025
నిద్ర లేవగానే కర దర్శనం ఎందుకు చేయాలి?

ఉదయం నిద్ర లేవగానే కర దర్శనం చేసుకుంటే లక్ష్మీ, సరస్వతీ, విష్ణుమూర్తులను దర్శించుకున్నట్లే అని పండితులు చెబుతున్నారు. అయితే ఈ ఆచారం వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. రాత్రంతా కదలిక లేకుండా ఉన్న కంటి నరాలకు ఈ ప్రక్రియ చిన్న వ్యాయామంలా పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల కళ్లకు నెమ్మదిగా కదలిక లభిస్తుంది, కంటి దోషాలు రాకుండా నివారిస్తుంది.
☞మన ఆచారాలు, వాటి వెనకున్న సైన్స్ కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.


