News August 31, 2024
శుభ ముహూర్తం

తేది: ఆగస్టు 31, శనివారం
త్రయోదశి: రాత్రి 3.41 గంటలకు
పుష్యమి: రాత్రి 7.39 గంటలకు
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉదయం 5.55-6.44 గంటల వరకు
Similar News
News February 27, 2026
కవిత కుటుంబంలో చిచ్చు పెట్టిన కేసు.. ఇప్పుడు క్లీన్‌చిట్

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ CM KCR కూతురు కవిత అరెస్ట్ అప్పట్లో సంచలనం సృష్టించింది. దీంతో BRSతో పాటు కుటుంబానికి కవిత దూరమయ్యారు. కానీ తాను కడిగిన ముత్యంలా బయటికి వస్తానని ఆమె చెబుతూ వచ్చారు. జైలు నుంచి వచ్చాక కష్ట సమయంలో పార్టీతో పాటు సోదరుడు కేటీఆర్ మద్దతు లభించలేదంటూ బహిరంగంగా విమర్శించారు. తర్వాత పార్టీని వీడారు. కేసులో ఇప్పుడు ఆమెకు <<19251453>>క్లీన్‌చిట్<<>> రావడం గమనార్హం.
News February 27, 2026
ఒకే రోజు రూ.10,000 పెరిగిన ధర

TG: వరంగల్(D) ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో టమాటా మిర్చి రకం ధర దూసుకెళ్తోంది. ఇవాళ క్వింటా రేటు ఏకంగా రూ.50,000 పలికింది. ఈ నెల 18న క్వింటా రూ.35,000, 19న రూ.36,000, 23న రూ.37,000, 25, 26న రూ.40,000 ధరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. శుక్రవారం ఒక్క రోజే క్వింటాకు రూ.10,000 పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 9 రోజుల్లో రూ.15వేలు పెరగడం విశేషం.
News February 27, 2026
ఒక్క ఫేక్ కేసుతో అధికారం పోయింది!

ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం 2021లో ప్రవేశపెట్టిన ఎక్సైజ్ పాలసీ వల్ల ఖజానాకు ₹2వేల కోట్ల నష్టం వాటిల్లిందనేది ఆరోపణ. ఈ కేసుపై CBI ఎంట్రీ ఇచ్చి అప్పటి CM కేజ్రీవాల్, Dy.CM సిసోడియాలను అరెస్టు చేసింది. కేజ్రీవాల్ 153 రోజులు, సిసోడియా 530 రోజులు జైలు జీవితాన్ని గడిపారు. దీంతో వారు పదవులనూ కోల్పోయారు. విపక్షాల ప్రచారంతో గతేడాది ఆప్ అధికారం కోల్పోయింది. ఇవాళ ఆ కేసంతా ఉత్తిదేనని కోర్టు <<19251338>>తీర్పునిచ్చింది.<<>>


