News December 10, 2025
శుభ సమయం (10-12-2025) బుధవారం

➤ తిథి: బహుళ షష్ఠి రా.7.08 వరకు
➤ నక్షత్రం: ఆశ్లేష ఉ.8.10 వరకు
➤ శుభ సమయాలు: ఏమీ లేవు
➤ రాహుకాలం: మ.12 నుంచి 1.30 వరకు
➤ యమగండం: ఉ.7.30 నుంచి 9వరకు
➤ దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.24 వరకు
➤ వర్జ్యం: రా.8.20 నుంచి 9.56 వరకు
➤ అమృత ఘడియలు: ఉ.6.46 నుంచి 8.18 వరకు
Similar News
News December 10, 2025
ఇంటి చిట్కాలు

* ఫర్నిచర్‌కు చెదలు పట్టకుండా ఉండాలంటే కర్పూరం పొడి, లిక్విడ్ పారాఫిన్ సమపాళ్ళలో తీసుకుని కలిపి, ఈ మిశ్రమంతో ఫర్నిచర్ తుడవాలి.
* బొద్దింకలు ఉన్న ప్రదేశాల్లో కీరదోసను ముక్కలుగా కోసి ఉంచితే బొద్దింకలు మళ్లీ కనిపించవు.
* ఓవెన్‌లో వెనీలా ఎసెన్స్ ఉంచి కొద్దిసేపు వేడి చేస్తే లోపలి దుర్వాసనలు తగ్గుతాయి.
* డైనింగ్ టేబుల్ మీద ఈగలు వాలుతుంటే ఉప్పు నీళ్ళలో తడిపిన వస్త్రంతో తుడిస్తే ఈగలు తగ్గుతాయి.
News December 10, 2025
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రంలో కోడిపుంజు ఎందుకు?

కార్తికేయుడి వాహనం నెమలి అని అందరికీ తెలుసు. అయితే ఆయన చిత్రాల్లో ఆ పక్షితో పాటు కోడిపుంజు కూడా ఉంటుంది. సుబ్రహ్మణ్యస్వామి శూరపద్ముడిని సంహరించేటప్పుడు ఆ రాక్షసుడు చెట్టు రూపంలో మారాడు. కార్తికేయుడు తన ఆయుధంతో ఆ చెట్టును చీల్చగా ఓ భాగం నెమలి, మరో భాగం కోడిపుంజుగా మారాయి. నెమలిని ఆయన తన వాహనంగా చేసుకున్నాడు. కోడిపుంజుని ధ్వజంగా స్వీకరించాడు. అలా కార్తికేయునికి కోడిపుంజుతో అనుబంధం ఏర్పడింది.
News December 10, 2025
ప్రాణాలు తీసిన గ్యాస్ గీజర్లు

గ్యాస్ గీజర్లు కారణంగా 2 వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. బెంగళూరులో 26 ఏళ్ల చాందినీతో పాటు నాలుగేళ్ల కుమార్తె గీజర్ గ్యాస్ లీక్ అయి ప్రాణాలు కోల్పోయారు. UPలోని బఘ్‌పట్‌లో అభిషేక్ అనే యువకుడు బాత్‌రూమ్‌లో గీజర్ నుంచి వెలువడిన గ్యాస్ వల్ల మృతిచెందాడు. తలుపును పగులగొట్టి బయటకు తీసేలోపే చనిపోయాడు. క్లోజ్డ్ బాత్‌రూమ్‌లో గ్యాస్ <<18108885>>గీజర్<<>> వినియోగం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


