News January 11, 2026
శుభ సమయం (11-1-2026) ఆదివారం

➤ తిథి: బహుళ అష్టమి మ.12.14 వరకు ➤ నక్షత్రం: చిత్త రా.8.14 వరకు ➤ శుభ సమయాలు: ఉ.7.29-10.15 వరకు, ఉ.11.10-12.50 వరకు తిరిగి మ.1.55-మ.4.07 వరకు ➤ రాహుకాలం: సా.4.30-6.00 వరకు ➤ యమగండం: మ.12.00-1.30 వరకు ➤ దుర్ముహూర్తం: సా.4.08-4.52 వరకు ➤ వర్జ్యం: రా.2.20-4.05 వరకు ➤ అమృత ఘడియలు: మ.1.21-3.04 వరకు
Similar News
News February 19, 2026
నేవీలో ఆఫీసర్ పోస్టులు.. పరీక్ష లేకుండానే..

260 ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయనుంది. పోస్టును బట్టి డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీతోపాటు శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అవివాహితులు మాత్రమే అర్హులు. జీతం ₹1.25-1.5 లక్షలు. ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/
News February 19, 2026
శ్రీలంకకు ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ ఔట్

T20 WC సూపర్-8కు ముందు శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. బౌలర్ మతీశ పతిరణ టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. ఈ నెల 16న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో తొడ కండరాలు పట్టేయడంతో మైదానాన్ని వీడారు. అతడు కోలుకోవడానికి 4-5 వారాలు పట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. దీంతో దిల్షాన్ మధుశంకను జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు IPLలోనూ పతిరణ ఆడటం డౌటేనని తెలుస్తోంది. అతడిని KKR ₹18 కోట్లకు <<18581979>>కొనుగోలు<<>> చేసింది.
News February 19, 2026
ఇలా పడుకుంటే మొటిమల ముప్పు

సాధారణంగా మన చర్మం విడుదల చేసే నూనెలు, చెమట, బ్యాక్టీరియాతో పాటు మృతకణాలూ దిండు పైకి చేరతాయి. దిండు కవర్లను తరచూ మార్చకపోతే మొటిమల ముప్పు ఉంటుంది. అలాగే మేకప్ తొలగించకపోవడం, బోర్లా పడుకోవడం, గదిలో ఉష్ణోగ్రత, హ్యుమిడిటీ ఎక్కువగా ఉండటం వల్ల కూడా చర్మం ఎక్కువ సీబమ్‌ను ఉత్పత్తి చేసి మొటిమలకు కారణమవుతాయి. కాబట్టి బెడ్‌రూంను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.


