News December 14, 2025

శుభ సమయం (14-12-2025) ఆదివారం

image

➤ తిథి: బహుళ దశమి రా.8.34 వరకు
➤ నక్షత్రం: హస్త ఉ.10.49 వరకు
➤ శుభ సమయాలు: ఏమీ లేవు
➤ రాహుకాలం: సా.4.30-6.00 వరకు
➤ యమగండం: మ.12.00-1.30 వరకు
➤ దుర్ముహూర్తం: సా.4.25-5.13 వరకు
➤ వర్జ్యం: రా.7.38-9.20 వరకు
➤ అమృత ఘడియలు: రా.6.00-7.42 వరకు

Similar News

News December 15, 2025

రేవంత్‌ ప్రభుత్వంపై కవిత విమర్శలు

image

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరుపై కవిత విమర్శలు చేశారు. ‘#AskKavitha’లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. ‘వాగ్దానాలు నెరవేరలేదు. కమిట్మెంట్స్ అన్నీ విఫలమయ్యాయి. ప్రజలు ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారు’ అని ధ్వజమెత్తారు. హీరో రామ్ చరణ్ గురించి మరొకరు అడగ్గా ‘ఆయన ఎంతో వినయంగా ఉంటారు. గొప్ప డాన్సర్. కానీ నేను చిరంజీవి అభిమానిని కాబట్టి ఆయనే గొప్ప’ అని బదులిచ్చారు.

News December 15, 2025

మిరపలో పూత, కాయతొలుచు పురుగు నివారణ

image

ఈ సమయంలో మిరపలో పూత పురుగు, కాయ తొలుచు పురుగు ఉద్ధృతి కూడా ఉంటుంది.
☛ మిరపలో పూత పురుగు నివారణకు లీటరు నీటికి కార్బోసల్ఫాన్ 1.6ml మందును 1500 పి.పి.ఎం వేపనూనె 5mlతో కలిపి పిచికారీ చేయాలి.
☛ మిరపలో కాయతొలుచు పురుగు నివారణకు లీటరు నీటికి ఫ్లూబెండమైడ్ + థయాక్లోప్రిడ్ 0.5 మి.లీ. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్+ ఫిప్రోనిల్ 1.2 మి.లీ. మందును కలిపి పిచికారీ చేయాలి.

News December 15, 2025

ఇతిహాసాలు క్విజ్ – 97 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: ఈ ఆలయంలో కొలువైన అంజన్న స్వామికి రెండు ముఖాలు ఉంటాయి. అందులో ఒకటి హనుమంతుడిది కాగా, మరొకటి నరసింహస్వామిది. మూల విరాట్టు భుజాలపై శంఖుచక్రాలు, ఛాతి మీద సీతారాముని రూపాలు కూడా కనిపిస్తాయి. ఈ ఆలయం తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది.
సమాధానం: కొండగట్టు అంజన్న స్వామి.
<<-se>>#Ithihasaluquiz<<>>