News January 19, 2026
శుభ సమయం (19-1-2026) సోమవారం

➤ తిథి: శుద్ధ పాడ్యమి రా.02.05 వరకు ➤ నక్షత్రం: ఉత్తరాషాఢ మ.12.11 వరకు ➤ శుభ సమయాలు: ఉ.06.35-7.30 వరకు, ఉ.08.26-09.21 వరకు, ఉ.11.12-మ.12.29 వరకు, మ.1.15-1.59 వరకు, తిరిగి మ.3.29-3.50 వరకు ➤ రాహుకాలం: ఉ.7.30-09.00 వరకు ➤ యమగండం: ఉ.10.30-మ.12.00 వరకు ➤ దుర్ముహూర్తం: మ.12.30-1.14 వరకు, తిరిగి మ.2.44-3.28 వరకు ➤ వర్జ్యం: సా.4.23-6.04 వరకు
Similar News
News February 14, 2026
మున్సిపల్ ఫలితాలు.. బీజేపీ ‘సున్నా’

TG: 116 మున్సిపాలిటీల్లో BJP ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. ఏకంగా 45 మున్సిపాలిటీల్లో ఒక్క వార్డూ సొంతం చేసుకోలేదు. ఉమ్మడి వరంగల్, MBNR, ఖమ్మం, NLG జిల్లాల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. 3 మున్సిపాలిటీల్లో (ఆదిలాబాద్, మెట్‌పల్లి, నారాయణపేట్) మాత్రమే మిగతా పార్టీల కంటే ఎక్కువ వార్డులు గెలుచుకుంది. అయితే బండి సంజయ్ ఒంటరి ప్రచారం తన పార్లమెంటు పరిధిలోని కరీంనగర్ మేయర్ పీఠాన్ని కట్టబెట్టింది.
News February 14, 2026
T20 WC: ఇవాళ తొలి ఎలిమినేషన్!

T20 WC-2026లో ఇవాళ 3 మ్యాచులు జరగనున్నాయి. తొలి మ్యాచు(11am) ఐర్లాండ్, ఒమన్ మధ్య జరగనుండగా ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశముంది. ఇరు జట్లు ఆడిన 2 మ్యాచుల్లోనూ ఓడటమే దీనికి కారణంగా ఉంది. అటు రెండో మ్యాచ్ ఇంగ్లండ్vsస్కాట్లాండ్(3pm), మూడో మ్యాచ్(7pm) న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరగనుంది. ఈ రెండు మ్యాచుల ఫలితాలు పాయింట్ల పట్టికలో ఆయా జట్ల స్థానాలను ప్రభావితం చేయనున్నాయి.
News February 14, 2026
శివ నామాలు అర్థాలు ‘‘సోమశేఖర’’

‘సోమ’ అంటే అమృతం/చంద్రుడు అని అర్థం. చంద్రుడిని ధరించినవాడు అనే అర్థమే కాకుండా, తనలో అమృతాన్ని(శాశ్వతత్వాన్ని) కలిగి ఉన్నవాడు అని కూడా అర్థం వస్తుంది. మనస్సుపై నియంత్రణ సాధించినవాడే యోగి అని చంద్రుడిని ధరించడం ద్వారా శివుడు సూచిస్తాడు. చంద్రుడు మనస్సుకు కారకుడు. అదుపు తప్పే మనస్సును తన ఆజ్ఞలో ఉంచుకునేవాడు ‘సోమశేఖరుడు’. ఈయనను పూజిస్తే మనోబలం పెరుగుతుందని, మానసిక సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.


