News January 2, 2026

శుభ సమయం (2-1-2026) శుక్రవారం

image

➤ తిథి: శుద్ధ చతుర్దశి సా.6.27 వరకు
➤ నక్షత్రం: మృగశిర రా.8.14 వరకు
➤ శుభ సమయాలు: ఉ.6.32 నుంచి 8.44 వరకు, ఉ.10.11 నుంచి 11.06 వరకు, మ.1.08 నుంచి 3.40 వరకు, సా.4.35 నుంచి 5.30 వరకు
➤ రాహుకాలం: ఉ.10:30 నుంచి 12:00 వరకు
➤ యమగండం: 3.00 PM నుంచి 4.30 PM
➤ దుర్ముహూర్తం: ఉ.8.45 నుంచి 9.28, మ.12.23-1.07
➤ వర్జ్యం: తె.4.07 నుంచి 5.38.

Similar News

News January 2, 2026

వరి మాగాణి మినుమును ఆశించే తెగుళ్లు

image

రబీ కాలంలో వరి మాగాణి భూముల్లో నాటిన మినుము పంటకు అనేక తెగుళ్ల బెడద ఉంటుంది. ముఖ్యంగా పైరు 35 నుంచి 40 రోజుల దశలో కొరినోస్పొరా ఆకుమచ్చ తెగులు, 45 నుంచి 50 రోజుల దశలో బూడిద తెగులు, 60 నుంచి 65 రోజుల దశలో తుప్పు తెగుళ్లు సోకే అవకాశం ఉంటుంది. మెరుగైన సస్యరక్షణ చర్యలు చేపడితే ఈ తెగుళ్లను సమర్థవంతంగా అదుపు చేయవచ్చు. తెగులు సోకిన చాలా రోజుల తర్వాత మందును పిచికారీ చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదు.

News January 2, 2026

ఒత్తిడిని ఇలా తగ్గించేద్దాం..

image

అధిక ఒత్తిడినించి బైట పడాలంటే చిన్న చిన్న పనులు చేయాలని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఆలోచనలు నెమ్మదిస్తాయి. డీప్‌ బ్రీతింగ్స్‌ తీసుకోవాలి. ముక్కు ద్వారా గాలిని పీల్చుకుని నోటి ద్వారా వదలాలి. చాలామంది ఒత్తిడికి గురైనప్పుడు ఆలోచించడం ఆపేయాలని అనుకుంటారు. కానీ దీని వల్ల ఆందోళన పెరుగుతుంది. కాబట్టి కొన్ని విషయాలు యాక్సెప్ట్‌ చేయడం అలవాటు చేసుకుంటేనే శరీరం, మనస్సు రిలాక్స్‌ అవ్వడం ప్రారంభిస్తాయి.

News January 2, 2026

గిగ్ వర్కర్లకు 90 రోజుల పని నిబంధన

image

గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు ప్రతిపాదించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకే అగ్రిగేటర్ వద్ద కనీసం 90 రోజులు, వేర్వేరు అగ్రిగేటర్ల వద్ద పనిచేసేవారు అయితే 120 రోజులు పని చేయాల్సి ఉంటుందని కేంద్ర కార్మిక శాఖ స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ఇప్పటికే కేంద్రం సూచించింది. అర్హులైన వారికి డిజిటల్ ఐడీ కార్డులను జారీ చేయనుంది.