News February 21, 2026
శుభ సమయం (21-2-2026) శనివారం

➤ తిథి: శుద్ధ చవితి మ.1.57 వరకు ➤ నక్షత్రం: రేవతి రా.8.14 వరకు ➤ శుభ సమయాలు: ఉ.7.58-8.20, ఉ.10.15-మ.1.09, మ.2.06-మ.3.04, సా.4.59-5.57 ➤ రాహుకాలం: ఉ.9.00-10.30 వరకు ➤ యమగండం: మ.1.30-3.00 వరకు ➤ దుర్ముహూర్తం: ఉ.6.24-7.57 ➤ వర్జ్యం: ఉ.8.42-10.15 ➤ అమృత ఘడియలు: సా.5.55-రా.7.27 వరకు
Similar News
News February 23, 2026
విశాఖపట్నంలో 38 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

విశాఖపట్నం DMHO 38 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులు, పట్టణ PHCలో కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు FEB 26వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డీఫార్మసీ, బీఫార్మసీ, DMLT, MLT, డిగ్రీ, BPT, స్పీచ్ &లాంగ్వేజ్ పాథాలజీ, ఆప్టోమెట్రీ, MSc(డిజబిలిటీ స్టడీస్), BEd(స్పెషల్ ఎడ్యుకేషన్), PG(చైల్డ్ సైకాలజీ), BDS/BSc ఉత్తీర్ణులు అర్హులు.
News February 23, 2026
తెలంగాణ ఉద్యమకారులకు గుడ్ న్యూస్

TG: తెలంగాణ సాధనలో పోరాడిన ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. తమకు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఉద్యమకారులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. పిటిషనర్ల తరఫున లాయర్ కరుణాకర్ రెడ్డి వాదించారు. అభయహస్తం స్కీం కింద అప్లై చేసిన వీరికి 8వారాల్లో ఇళ్ల స్థలాలు, పెన్షన్లు ఇవ్వాలని న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి తీర్పు ఇచ్చారు.
News February 23, 2026
అమరావతిలో రూ.40,887 కోట్లతో ట్రంక్ రోడ్లు

AP: అమరావతిలో రూ.40,887 కోట్లతో ప్రభుత్వం ట్రంక్ రోడ్ల నిర్మాణం చేపడుతోంది. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు సమీకరిస్తోంది. ఇందులో భాగంగా IRRను 96 KM మేర 8+4గా నిర్మించనున్నారు. 26 గ్రామాల్లో భూ సమీకరణ చేయనున్నారు. 2027 నాటికి ఇది పూర్తవుతుంది. కాగా రోడ్ల నిర్మాణానికి ఇప్పటికే రూ.18,779 కోట్లతో టెండర్లు కూడా పిలిచామని మంత్రి నారాయణ ఇటీవల అసెంబ్లీలో తెలిపారు.


