News January 24, 2026
శుభ సమయం (24-1-2026) శనివారం

➤ తిథి: శుద్ధ షష్టి రా.10.58 వరకు ➤ నక్షత్రం: ఉత్తరాభాద్ర మ.1.14 వరకు ➤ శుభ సమయాలు: ఉ.8.05-8.26 వరకు, ఉ.10.18-1.05 వరకు, మ.2.01-మ.2.56 వరకు, సా.4.48-5.44 వరకు➤ రాహుకాలం: ఉ.9.00-10.30 వరకు ➤ యమగండం: మ.1.30-మ.3.00 వరకు ➤ దుర్ముహూర్తం: ఉ.6.35-8.04 వరకు ➤ వర్జ్యం: రా.12.43-2.15 వరకు ➤ అమృత ఘడియలు: ఉ.8.34-10.08 వరకు
Similar News
News April 5, 2026
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ చికెన్ ధరలు కేజీ రూ.230-రూ.300 మధ్య ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రాంతాలను బట్టి రూ.260 నుంచి రూ.290, వరంగల్‌లో రూ.280, కామారెడ్డి జిల్లాలో రూ.280-రూ.290 వరకు విక్రయిస్తున్నారు. విజయవాడలో రూ.230, గుంటూరులో రూ.250, విశాఖలో రూ.270, బాపట్లలో రూ.300కు అమ్ముతున్నారు. మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News April 5, 2026
మాచర్ల CI వెంకటరమణ సస్పెన్షన్

AP: ప్రేమ వివాహం చేసుకున్న <<19545664>>చౌడేశ్వరిని<<>> నిబంధనలకు విరుద్ధంగా, బలవంతంగా ఆమె తల్లిదండ్రులకు అప్పగించినందుకు మాచర్ల CI వెంకటరమణను జిల్లా SP సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో ఆయన బాధితురాలి తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. CI అప్పగించిన కాసేపటికే ఆమె హత్యకు గురవడంతో ఈ నేరంలో ఆయన పాత్రపై ఆరోపణలొచ్చాయి. దీంతో CIపై SP కృష్ణారావు చర్యలు తీసుకున్నారు.
News April 5, 2026
ఆ ఏనుగు ఫిబ్రవరిలోనే చనిపోయింది!

జైపూర్‌లో ఓ ఏనుగుకు ఒళ్లంతా పింక్ కలర్ వేసి ఫొటోషూట్ చేయడం ఇటీవల వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే, ఆ ఘటన ఏడాది క్రితం జరిగినట్లు తాజాగా తేలింది. దాదాపు 67 ఏళ్ల వయసున్న చంచల్ అనే ఆ ఏనుగు ఫిబ్రవరిలోనే కార్డియాక్ అరెస్ట్‌తో మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారని NDTV పేర్కొంది. వృద్ధాప్యం వల్లే చనిపోయిందని, కలర్‌తో ఎలాంటి సంబంధం లేదని స్థానికులు తెలిపారు.


