News November 24, 2025

శుభ సమయం (24-11-2025) సోమవారం

image

✒ తిథి: శుక్ల చవితి సా.5.55 వరకు
✒ నక్షత్రం: పూర్వాషాడ రా.7.40 వరకు
✒ శుభ సమయాలు: లేవు
✒ రాహుకాలం: ఉ.7.30-ఉ.9.00
✒ యమగండం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-మ.1.12, మ.2.46-మ.3.34
✒ వర్జ్యం: తె.4.08-ఉ.5.50
✒ అమృత ఘడియలు: మ.2.53-సా.4.35

Similar News

News November 24, 2025

ఇంట్లో శివలింగం ఉంటే.. ఈ నియమాలు తప్పనిసరి

image

ఎత్తైన శివలింగాన్ని ఇంట్లో ప్రతిష్ఠిస్తే కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలని పండితులు చెబుతున్నారు.
☛ లింగం నుంచి నిత్యం శక్తి విడుదలవుతూ ఉంటుంది. కాబట్టి పైనుంచి చిన్న నీటి ప్రవాహమైనా ఉండాలి. ☛ రోజూ సాత్విక నైవేద్యం పెట్టాలి. ☛ ఇంట్లో మాంసాహారం వండకూడదు. ఇంట్లో వారెవరూ మద్యమాంసాలు ముట్టుకోకూడదు. ☛ ఓ ఇంట్లో 2 లింగాలను ప్రతిష్ఠించకూడదు. ☛ శివలింగం ఉన్న పూజా మందిరం పవిత్రంగా, పరిశుభ్రంగా ఉండాలి.

News November 24, 2025

మహిళా అభివృద్ధి &శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు

image

TG:<>పెద్దపల్లి <<>>జిల్లాలోని మహిళా అభివృద్ధి& శిశు సంక్షేమశాఖ 16 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ, డిగ్రీ, LLB, ANM, GNM, MBBS, BAMS, BHMS, BSc(నర్సింగ్), డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://peddapalli.telangana.gov.in/

News November 24, 2025

వాయుగుండం.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: ద.అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా బలపడనుందని APSDMA వెల్లడించింది. ఆ తర్వాత 48 గంటల్లో తుఫానుగా మారుతుందని తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అంచనా వేసింది. వీటి ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.