News March 25, 2024

శృంగవరపుకోటలో ఇద్దరూ మహిళలే గెలిచారు

image

1952 నాటి నుంచి 2019 వరకు ఎస్.కోట నియోజకవర్గంలో17 సార్లు జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇద్దరు మహిళలు మాత్రమే గెలుపొందారు. 1999లో టీడీపీ నుంచి తొలిసారిగా శోభా హైమావతి కాంగ్రెస్ అభ్యర్థి గంగాధర స్వామి శెట్టిపై విజయం సాధించారు. టీడీపీ నుంచి కోళ్ల లలిత కుమారి 2009లో కాంగ్రెస్ అభ్యర్థి ఏ.జోగినాయుడు, 2014లో వైసీపీ అభ్యర్థి రొంగలి జగన్నాథంపై విజయం సాధించారు.

Similar News

News September 15, 2025

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలి: ఎస్పీ

image

అసాంఘిక కార్యకలాపాలపై పోలీసు అధికారులు ఉక్కు పాదం మోపాలని జిల్లా SP ఏఆర్ దామోదర్ అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన సోమవారం తన కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను వివరించి, నిర్వహించాల్సిన విధుల గురించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాలోని ఆయా సబ్ డివిజన్ల పరిధిలో ప్రధాన నేరాలు, శాంతి భద్రతల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

News September 15, 2025

VZM: నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ఉదయం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రామ సుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.

News September 14, 2025

రేపు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ఈ నెల 15న సోమవారం ఉదయం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రామ సుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.