News September 20, 2025
శృంగవరపుకోటలో మెగా జాబ్ మేళా

ఎస్.కోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శంకరరావు తెలిపారు. పదో తరగతి నుంచి పీజీ పూర్తి చేసి, 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. 12 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేస్తారన్నారు. ఉదయం 9 గంటలకు విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, ఫొటోలతో హాజరుకావాలని కోరారు.
Similar News
News September 20, 2025
దీపం-2 పథకం అమలుపై విజయనగరం జేసీ సమీక్ష

కలెక్టరేట్లో జేసీ సేతుమాధవన్ అధ్యక్షతన దీపం-2 పథకం అమలుపై శుక్రవారం సమావేశం నిర్వహించారు. సబ్సిడీ నగదు వినియోగదారుల ఖాతాలలో జమ కానందుకు ఆధార్-బ్యాంక్ లింక్ సమస్యలు, ఖాతాలు బ్లాక్ కావడం ప్రధాన కారణాలని ఆయన తెలిపారు. గ్యాస్ ఏజెన్సీ డీలర్లు వీటిని పరిష్కరించి లబ్ధిదారులకు సబ్సిడీ చేరేలా చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశించారు. అదనపు డబ్బులు వసూలు చేసే డెలివరీ బాయ్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
News September 20, 2025
విజయనగరంలో హైకోర్టు జడ్జిల పర్యటన

విజయనగరంలో పర్యటన నిమిత్తం ఏపీ హైకోర్టు జడ్జిలు జస్టిస్ చీమలపాటి రవి, జస్టిస్ వై.లక్ష్మణరావు శుక్రవారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. నగరానికి చేరుకున్న ఇద్దరు జడ్జిలను కలెక్టర్ ఎస్.రామ సుందర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News September 19, 2025
VZM: ఉద్యోగుల నుంచి 40 వినతులు స్వీకరణ

విజయనగరం కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన ఉద్యోగుల గ్రీవన్స్‌కు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నుంచి 40 వినతులు అందాయి. ఈ వినతులను కలెక్టర్, JC సేతు మాధవన్, RDO శ్రీనివాస మూర్తి స్వీకరించగా జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ రామసుందర రెడ్డి మాట్లాడుతూ.. అందిన వినతుల్లో జిల్లా స్థాయిలో ఉన్నవి పరిష్కరించాలని, కానివి రాష్ట్ర స్థాయికి పంపాలన్నారు.