News March 18, 2024

శెట్టూరు మండలంలో చిరుత మృతి

image

శెట్టూరు మండలం ఐదుకల్లు అటవీ ప్రాంతంలో చిరుత మృతి చెందింది. వారం కిందట అనారోగ్యంతో మృతిచెందినట్లు అటవీశాఖ అధికారులు సోమవారం నిర్ధారించారు. వన్యప్రాణులకు తాగునీరు లేక మైదాన ప్రాంతంలోకి వచ్చి వ్యవసాయ పొలాల్లో నీళ్లు తాగి వెళ్తున్నాయని రైతులు చెప్తున్నారు. నీరు లేక చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు అటవీ ప్రాంతం నుంచి బయటికి వచ్చి దాహంతో అనారోగ్యానికి గురవుతున్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

Similar News

News July 8, 2024

అనంత: కక్కలపల్లి మార్కెట్‌లో తగ్గిన టమాటా ధర

image

కక్కలపల్లి మార్కెట్లో టమాటా ధరలు తగ్గాయి. గత నాలుగైదు రోజులు కిలో గరిష్ఠ ధర రూ.35 పైన పలుకుతూ వచ్చాయి. ఆ ధర ఆదివారం రూ.30కి పడిపోయింది. కిలో సరాసరి ధర రూ.23, కనిష్ఠ ధర రూ.18తో పలికినట్లు రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రాంప్రసాద్ తెలిపారు. మొత్తంగా మార్కెట్లోని మండీలకు 60 టన్నుల టమాటా వచ్చాయన్నారు.

News July 8, 2024

పీఏబీఆర్‌లో పడిపోయిన నీటిమట్టం

image

కూడేరు మండల పరిధిలోని పెన్నాహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) డ్యాంలో నీటిమట్టం పడిపోయిందని అధికారులు తెలిపారు. ఆదివారం నాటికి డ్యామ్‌లో 0.588 టీఎంసీల నీరు ఉన్నట్లు డ్యాం అధికారులు వెల్లడించారు. జలాశయం వద్ద ఏర్పాటైన శ్రీరామారెడ్డి, సత్యసాయి, అనంతపురం, ఉరవకొండ, కూడేరు తాగునీటి ప్రాజెక్టులకు రోజు సుమారు 60 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తున్నామన్నారు.

News July 8, 2024

అనంత: రోడ్డు ప్రమాదంలో సెక్యూరిటీగార్డు దుర్మరణం

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం ఉదయం జరిగింది. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న లక్ష్మీనారయణ విధులు ముగించుకుని బైక్‌లో వెళుతుండగా బత్తలపల్లి మండలం ముష్టూర్ వద్ద కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. మిగిలిన విషయాలు తెలియాల్సి ఉంది.