News August 23, 2025

శేరిలింగంపల్లి ఎమ్మెల్యేకు నోటీసులు.. ఉత్కంఠ

image

పార్టీ ఫిరాయింపుల అంశంలో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. పార్టీ మారిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయింది. బీఆర్ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేపై 3 నెలల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై గాంధీ ఎలా స్పందిస్తారోనని ఉత్కంఠత నెలకొంది.

Similar News

News March 29, 2026

పొంగులేటిని బర్తరఫ్ చేయాల్సిందే: కేటీఆర్

image

TG: పొంగులేటిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాల్సిందేనని, ప్రభుత్వం దిగిరాకపోతే గవర్నర్‌ను కలుస్తామని KTR స్పష్టం చేశారు. అసెంబ్లీలో <<19499785>>రాఘవ<<>> కన్‌స్ట్రక్షన్స్ వ్యవహారంపై BRS ఆందోళనకు దిగింది. హౌస్ కమిటీ వేయాలని, పొంగులేటిని బర్తరఫ్ చేయాలంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. పోడియం వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో మార్షల్స్ అడ్డుకున్నారు. అనంతరం కేటీఆర్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు.

News March 29, 2026

రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగుతా: బీదా మస్తాన్ రావు

image

నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె బోట్ల మాయానికి సంబంధించి తన ప్రమేయం ఉందని ఆధారాలతో సహా ఒక్క శాతం నిరూపించినా తన స్థానానికి రాజీనామా చేస్తానని బీదా మస్తాన్ యాదవ్ ప్రకటించారు. అంతేకాకుండా రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానన్నారు. నెల్లూరు నగరంలోని తన నివాసంలో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. కొంతమంది రాజకీయ కుట్రతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.

News March 29, 2026

MDK: మీ బైక్, కార్‌కు DANGER

image

2023కు ముందు తయారైన బైక్, కార్లు ఇక నుంచి డేంజర్‌లో పడ్డట్టే. APRIL-1 నుంచి ఉమ్మడి MDKలో అన్ని బంకుల్లో E-20 పెట్రోల్ మాత్రమే విక్రయించనున్నారు. దీన్ని తట్టుకునేలా పైపులు మార్చాలి. దీనికి దుమ్ము, తేమను ఆకర్షించే గుణం ఉంటుంది. ఫ్యూయల్ ఫిల్టర్ మారుస్తుండాలి. ట్యాంక్‌లో సగానికిపైగా పెట్రోల్ ఉండాలి. జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంజిన్ డ్యామేజ్ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.# SHAREIT