News January 4, 2025

శేషాచలం అడవుల్లో శ్రీకాళహస్తి బీటెక్ విద్యార్థుల మిస్సింగ్

image

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పరిసరాలైన శేషాచలం అడవుల్లో బీటెక్ విద్యార్థులు దారి తప్పిపోయారు. శ్రీ కాళహస్తి నుంచి వచ్చిన ఆరుగురు బీటెక్ విద్యార్థులు, అడవిలోని అందమైన వాటర్‌ఫాల్స్‌ను చూసేందుకు శుక్రవారం వచ్చారు. తిరుగు ప్రయాణంలో వారు దారితప్పి అడవిలో చిక్కుకుపోయారు. దారి తప్పిన ఆరుగురిలో ఒకరు అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు గాలిస్తున్నారు.

Similar News

News January 6, 2025

తిరుపతి: సంక్రాంతి ట్రైన్లు.. 8గంటలకు బుకింగ్

image

➥ చర్లపల్లి-తిరుపతి(07077): 6వ తేదీ
➥ తిరుపతి-చర్లపల్లి(07078): 7వ తేదీ
➥చర్లపల్లి-తిరుపతి(02764):8, 11, 15 వ తేదీ
➥ కాచిగూడ-తిరుపతి(07655): 9, 16వ తేదీ
➥ తిరుపతి-కాచిగూడ(07656): 10, 17వతేదీ
పై ట్రైన్ల బుకింగ్ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతాయి. గెట్ రెడీ.

News January 6, 2025

తిరుపతి: అంబులెన్స్ ఢీకొని ఇద్దరు భక్తులు మృతి

image

కాలినడకన వస్తున్న భక్తులను 108 అంబులెన్స్ ఢీకొన్న ఘటన సోమవారం ఉదయం చంద్రగిరి మండలం నరసింగాపురం సమీపంలోని నారాయణ కళాశాల వద్ద చోటు చేసుకుంది. పుంగనూరు నుంచి నడుచుకొస్తున్న భక్తులు తిరుపతి వైపుగా వెళుతుండగా వెనుక నుంచి అంబులెన్స్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు.

News January 6, 2025

SVU: ఫలితాలు విడుదల

image

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గతేడాది జూన్‌లో రెగ్యులర్ డిగ్రీ (UG) BA/B.COM/BSC/BCA/BBA/B.VOC రెండో సెమిస్టర్ జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షలు విభాగ నియంత్రణ అధికారి ధామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.