News February 8, 2026
శేష వాహన సేవలో మన్యంకొండ శ్రీవారు

మన్యంకొండ శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా అత్యంత విశేషమైన శేష వాహన సేవ శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. రాత్రి 9 గంటల తర్వాత ఆదిశేషునిపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సేవను దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. శేష వాహన సేవను దర్శించడం వల్ల పాపాలు తొలగి, కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
Similar News
News February 9, 2026
కోడి మాంసం, గుడ్లు తినొచ్చు: మంత్రి అచ్చెన్నాయుడు

AP: బర్డ్ ఫ్లూను పూర్తిగా నియంత్రణలోకి తీసుకొస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అన్నమయ్య(D) సదుం(M)లో వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. కోళ్ల పెంపకందారులు బయోసెక్యూరిటీ చర్యలు పాటించాలని ఆదేశించారు. కోడి మాంసం, గుడ్ల వినియోగం పూర్తిగా సురక్షితమని చెప్పారు. అసాధారణ రీతిలో పక్షులు మరణిస్తే అధికారులకు తెలియజేయాలన్నారు.
News February 9, 2026
టెన్త్ పరీక్షల ఫీజుకు 3 రోజులే గడువు: DEO

అల్లూరి, పోలవరం జిల్లా టెన్త్ విద్యార్థుల పరీక్షలు ఫీజు గడువు ఈ నెల 12తో ముగుస్తుందని DEO రామకృష్ణారావు సోమవారం తెలిపారు. తత్కాల్ ద్వారా రూ. 1000 అపరాధ రుసుంతో చెల్లించవచ్చన్నారు. ప్రైవేట్, రెగ్యులర్ విద్యార్థులకు ఈ గడువు వర్తిస్తుందన్నారు. WWW.bseap.org.website. ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చని సూచించారు. మార్చి 16 నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అవుతాయన్నారు.
News February 9, 2026
ఉచిత అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలి: APC మమ్మీ

ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 1వ తరగతిలో ఉచిత అడ్మిషన్లకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష APC మమ్మీ సోమవారం కోరారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు కేటాయించారని చెప్పారు. పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు అవకాశం కల్పిస్తామన్నారు. నివాస ప్రాంతానికి సమీపంలోని పాఠశాలలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 20 నుంచి మార్చి10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు.


