News September 11, 2025
శ్రమకు సెల్యూట్.. ఆకాశమంత ఎత్తులో కూలీల కష్టం!

కూటి కోసం కోటి విద్యలు అన్న నానుడి తెలిసిందే. ప్రాణాలకు తెగించి పనిచేస్తూ పొట్ట నింపుకునే వారు ఎందరో ఉన్నారు. కష్టపడి పనిచేసే వారికి ఆ పని వెనుక ఉన్న శ్రమ తెలుసు. అయితే నంద్యాల జిల్లా గడివేముల మండలంలో 760 కేవీ విద్యుత్ లైన్ పనులు జరుగుతున్నాయి. కొంతమంది శ్రామికులు ఆకాశమంత ఎత్తులో విద్యుత్ వైర్ల పనులు చేస్తున్న దృశ్యాన్ని Way2News క్లిక్ మనిపించింది. ఈ చిత్రం శ్రమైక్య జీవన సౌందర్యానికి నిదర్శనం.
Similar News
News September 11, 2025
నల్గొండ: లెక్క తేలింది.. ఎన్నికలే తరువాయి..

NLG, SRPT జిల్లాలో స్థానిక ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల వారీగా ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. నల్గొండ జిల్లాలో 869 గ్రామ పంచాయతీలుండగా, 10,73,506 మంది ఓటర్లున్నట్లు ఎన్నికల సంఘం లెక్క తేల్చింది. ఎలక్షన్స్ నిర్వహణ కోసం 7,494 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. సూర్యాపేట జిల్లాలో 486 పంచాయతీలకు గాను 6,94,815 మంది ఓటర్లున్నారు. 4,403 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
News September 11, 2025
ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ గ్రౌండ్ బకాయిల వివరాలు

ప్రొద్దుటూరు మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేలంపై కౌన్సిల్ సమావేశంలో 24 గంటలు ఉత్కంఠత అనంతరం ఆమోదం తెలిపారు. 9 ఏళ్లుగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు మున్సిపాలిటీకి బకాయిలు పెడుతూనే ఉన్నారు. వాటి వివరాలు (లక్షలలో)..
2015లో రూ.3.96, 2016లో రూ.3.13, 2017లో రూ.2, 2018లో రూ.4.75, 2019లో రూ.8.02, 2021లో రూ.7.10, 2022లో రూ.30.06, 2023లో రూ.5.66, 2024లో రూ.31.50 బకాయిలు మున్సిపాలిటీకి రావాల్సి ఉంది.
News September 11, 2025
ADB: వాగు దాటి.. వైద్యం చేసి

బాధిత గ్రామాల ప్రజలకు సేవ చేయడానికి వైద్య సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారు. బజార్‌హత్నూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడానికి వైద్య సిబ్బంది పడ్డ కష్టాలు చూస్తే వారి అంకితభావం అర్థమవుతుంది. గ్రామానికి అడ్డుగా ప్రవహిస్తున్న వాగును తంటాలు పడుతూ దాటి, నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన మందులు పంపిణీ చేశారు.