News December 11, 2025
శ్రవణ్ సాయి హత్య.. సంచలన ఆరోపణలు

కృష్ణా(D)కు చెందిన శ్రవణ్ సాయి <<18525669>>హత్య కేసులో<<>> మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూశాయి. ‘ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు. నా కూతురు గర్భవతి అని తెలిసింది. తప్పు చేసిందని ఆమెను కొట్టబోతుండగా అడ్డురావడంతో అతడికి దెబ్బలు తగిలాయి. ప్రెగ్నెన్సీ సంగతి అమ్మకు తెలిసిందని అతడికి నా కూతురు మెసేజ్ చేసిందట’ అని అమ్మాయి తల్లి తెలిపారు. శ్రవణ్‌ను టార్చర్ చేసి చంపారని, ఒంటిపై గాయాలున్నాయని అతని బంధువులు ఆరోపిస్తున్నారు.
Similar News
News December 13, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<
News December 13, 2025
వెనిజుల సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం!

వెనిజుల-అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. వెనిజుల తీరం వెంబడి USకు చెందిన F/A-18 జెట్‌లు దాదాపు 40 నిమిషాల పాటు తిరిగాయి. అదే విధంగా బాంబర్లు, ఫైటర్ జెట్లు, లాంగ్ రేంజ్ డ్రోన్లు చక్కర్లుకొడుతుండటం ఉద్రిక్తతలకు దారితీసింది. తీరానికి 20 మైళ్ల దూరం వరకు ఇవి వచ్చినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ అక్రమ రవాణా విషయంలో ఆగ్రహంగా ఉన్న ట్రంప్ ఆ దేశంపై <<18453636>>దాడి<<>> చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
News December 13, 2025
SBIలోనూ వడ్డీ రేట్లు తగ్గాయ్

<<18500647>>RBI<<>> రెపో రేటును 0.25% మేర తగ్గించిన నేపథ్యంలో SBI కూడా రుణ రేట్లను సవరించింది. ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ రేటు(EBLR)ను 7.90 శాతానికి కుదించింది. MCLRను 5 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 8.70 శాతానికి చేరింది. అలాగే 2-3 ఏళ్ల వ్యవధి FD రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.40 శాతానికి, 444 రోజుల కాలవ్యవధి రేటును 6.45 శాతానికి పరిమితం చేసింది. ఈ రేట్లు ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తాయంది.


