News May 5, 2024
శ్రీకాకుళం:ఎన్నికల ప్రక్రియ పరిశీలించిన సహాయ కలెక్టర్

సాధారణ ఎన్నికలు-2024లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలకు సంబంధించి స్థానిక ప్రభుత్వ కళాశాలలో నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను శనివారం సాయంత్రం సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పరిశీలించారు. అనంతరం అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.
Similar News
News December 17, 2025
సంక్రాంతికి ఉత్తరాంధ్రకు ప్రత్యేక రైళ్లు (1/2)

సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్డు మార్గంలో 16ప్రత్యేక రైళ్లకు నడుపుతున్నట్లు SCR ప్రకటించింది.
➣జనవరి 9, 11: సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్డు(07288)
➣జనవరి 10, 12: శ్రీకాకుళం రోడ్డు- సికింద్రాబాద్(07289)
➣జనవరి 10, 12, 16, 18: సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్డు (07290)
<<18587966>>CONTINUE..<<>>
News December 17, 2025
సంక్రాంతికి ఉత్తరాంధ్రకు ప్రత్యేక రైళ్లు (2/2)

సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఉత్తరాంధ్రకు నడిచే ప్రత్యేక రైళ్లు ఇవే..
➣11, 13, 17, 19 తేదీల్లో శ్రీకాకుళం రోడ్డు ➝ సికింద్రాబాద్ (07291)
➣13న వికారాబాద్ ➝ శ్రీకాకుళం రోడ్డు (07294)
➣14న శ్రీకాకుళం రోడ్డు ➝ సికింద్రాబాద్ (07295)
➣17న సికింద్రాబాద్ ➝ శ్రీకాకుళం రోడ్డు (07292)
➣18న శ్రీకాకుళం రోడ్డు ➝ సికింద్రాబాద్ (07293)
News December 17, 2025
టెక్కలి ఇండోర్ మైదానానికి మహర్దశ: మంత్రి అచ్చెన్న

గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా అన్ని రంగాలకూ కూటమి ప్రభుత్వం సమున్నత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు నిమ్మాడ క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. టెక్కలి ఇండోర్ స్టేడియంకు మహర్దశ కల్పించేందుకు నిర్ణయించామన్నారు. తదనుగుణంగా పనులు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించామని స్పష్టం చేశారు. పాలన అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు.


