News February 16, 2025
శ్రీకాకుళంలో ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం..!

శ్రీకాకుళం జిల్లాకు ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం వస్తుందని ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో రైతాంగానికి ఎంతో మేలు కలుగుతుందని ఆయన అన్నారు. ఇది వరకూ ఈ కార్యాలయం బొబ్బిలిలో ఉండేదని చెప్పారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసేందుకు రాష్ర్ట మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కృషి ఎంతో ఉందని అన్నారు. రైతాంగానికి అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందన్నారు.
Similar News
News February 19, 2025
మందస: పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య

మందస మండలం లోహరిబంధలో బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ బాలిక స్థానికంగా 8వ తరగతి చదువుతుంది. మధ్యాహ్నం పాఠశాలలో భోజనం అనంతరం సమీపంలోని జీడీ తోటలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.
News February 19, 2025
SKLM: ‘ఆవుపాలు ధర పెంచాలి’

తగ్గించిన ఆవుపాలు ధర పెంచాలని.. కనీస వెన్న శాతాన్ని 2.8 శాతం నుంచి 3.1 శాతానికి పెంచడాన్ని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మర్రాపు సూర్య నారాయణ డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని రైతు సంఘ కార్యాలయంలో బుధవారం పాల రైతులతో సమావేశం జరిగింది. 30 లీటర్ల కంటే తక్కువ పాలు పోసిన సెంటర్లను ఆపే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.
News February 19, 2025
కృష్ణా యూనివర్సిటీ వీసీగా పొందూరు వాసి

పొందూరు మండలం పెనుబర్తి గ్రామానికి చెందిన కూన రాంజీ విజయవాడలోని కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు విడుదలయ్యాయి. గతంలో ఆయన ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీ వీసీగా పనిచేశారు. ఈయన నియామకంపై పొందూరు వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరెన్నో పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.