News July 17, 2024

శ్రీకాకుళంలో ఈ నెల 19న జాబ్ మేళా

image

శ్రీకాకుళంలోని బలగ ప్రభుత్వ DLTC, ITI లో ఈ నెల 19న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొత్త లంక సుధా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో రెండు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగుల కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామన్నారు. పదో తరగతి ఆపై విద్యా అర్హతలు ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News February 25, 2026

శ్రీకాకుళంలో డయేరియా.. అధికారుల ప్రత్యామ్నాయం

image

శ్రీకాకుళం నగరంలో డయేరియా ప్రబలడంతో ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిపివేశారు. పైప్ లైన్‌లో డ్రైనేజ్ నీరు చేరటం వల్ల నీరు కలుషితమైందన్న అనుమానం వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ హెచ్. కూర్మారావు తెలిపారు. మరో పక్క కుళాయిల ద్వారా సరఫరా చేసిన తగునీటిని విశాఖపట్నానికి పరీక్షల నిమిత్తం పంపారు.

News February 25, 2026

శ్రీకాకుళం: 70 ఏళ్ల వయసులో పరీక్ష

image

డీఈవోగా, డిపెప్ (ప్రస్తుత సర్వశిక్షా అభియాన్) ఏపీసీగా సేవలందించి పదవీ విరమణ చేసిన బలివాడ మల్లేశ్వరరావు చదువుపై తన ఆసక్తిని మరొకసారి చాటుకున్నారు. వమరవల్లి ఉపాధ్యాయ శిక్షణ కేంద్రంలో సీనియర్ లెక్చరర్‌గా పనిచేసిన ఆయన సుమారు 70 ఏళ్ల వయసులోనూ ఎంఎస్ఐఎస్సీ సెమిస్టర్ పరీక్షలు రాశారు. ఇప్పటికే అనేక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు పూర్తి చేసిన ఆయన మంగళవారం బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో పరీక్ష రాశారు.

News February 25, 2026

శ్రీకాకుళం: అతి సార నియంత్రణకు జిల్లా అధికారులతో కమిటీ

image

శ్రీకాకుళంలో అతిసార నియంత్రణ చర్యలను పర్యవేక్షించేందుకు జిల్లా అధికారులతో కమిటీ ఏర్పడింది. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్, ఏపీఎంఐపీ, మెప్మా పీడీలు, ఉద్యానవన శాఖ ఏడీ, పశుసంవర్ధక శాఖ జేడీలతో ప్రత్యేక బృందాన్ని కలెక్టర్ స్వప్నిల్‌ దినకర్ పుండ్కర్ నియమించారు. క్షేత్రస్థాయిలో ఆరోగ్య పరిస్థితి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణను వీరు పర్యవేక్షించనున్నారు.