News September 18, 2024
శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు సంస్థ ఘరానా మోసం

శ్రీకాకుళం రైతు బజారు సమీపంలో ఓ ప్రైవేటు సంస్థ బాధితులను మోసం చేసిన ఘటన చోటుచేసుకుంది. ఆ సంస్థ తక్కువ పెట్టుబడితో లాభాలు పొందవచ్చని ఖాతాదారులను నమ్మించింది. జిల్లాలో సుమారు 3 వేల మంది సభ్యులుగా చేర్చుకుంది. పలు మార్గాల రూపంలో డబ్బులు వసూలు చేసి, 4 నెలలుగా అనుమానం కలగకుండా సక్రమంగా చెల్లింపులు జరిపింది. సంస్థ కార్యకలాపాలు అందుబాటులో లేకపోవడంతో మోసపోయామని బాధితులు పోలీసులకు సమాచారం అందించారు.
Similar News
News December 26, 2025
శ్రీకాకుళం యువకుడిని ట్రాప్ చేసిన వివాహిత

శ్రీకాకుళం యువకుడిని విశాఖకు చెందిన భార్యాభర్తలు కలిసి హనీట్రాప్ చేయడంతో అతను రూ.3 లక్షలు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మల్కాపురం ప్రాంతానికి చెందిన సురేంద్రారెడ్డి తన అక్కవాళ్ల ఇంట్లో ఉంటున్నాడు. అక్కవాళ్ల పిల్లలను స్కూల్‌కి తీసుకునివెళ్లే సమయంలో ఓ యువతితో పరిచయం ఏర్పాడగా తన భర్తకు ఈ విషయం తెలిసిపోయిందంటూ అతడిని బెదిరించి రూ.3లక్షలు కాజేసింది. యువకుడు మహరాణిపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
News December 26, 2025
వచ్చే ఏప్రిల్ నాటికి పలాస రైల్వే వంతెన: రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం జిల్లా వాసులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పలాస- కాశీబుగ్గ రైల్వే ఓవర్ బ్రిడ్జి వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కార్యాలయం నుంచి గురువారం ప్రకటన వెలువడింది. ఇప్పటికే పలు దఫాలుగా పలాస-కాశీబుగ్గ రైల్వే ఓవర్ బ్రిడ్జితో పాటు, తాలపధ్ర రైల్వే బ్రిడ్జిల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి స్పష్టం చేశారు.