News April 25, 2024

శ్రీకాకుళంలో నామినేషన్ వేసింది వీరే..

image

➤ పలాస: CPI- కామేశ్వరరావు
➤ ఇచ్ఛాపురం: BSP- వేదవర బైసాయి
➤ టెక్కలి: BSP- శ్రీనివాసరావు,
➤శ్రీకాకుళం: PPI-లక్ష్మణ
➤ ఆమదాలవలస: PPI-మధుసూదనరావు
➤ పాతపట్నం:INCP- వెంకట్‌రావు, స్వతంత్ర – మోహనరావు, JBNP- తిరుపతిరావు, కృష్ణ- స్వతంత్ర అభ్యర్థి, GDP- సంజీవరావు
➤ ఎచ్చెర్ల: గొర్లె కిరణ్ కుమార్ – స్వతంత్ర అభ్యర్థి, రమ్య సువ్వారు స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లు దాఖలు చేశారు.

Similar News

News April 14, 2026

మహిళలే నేటి మహారాణులు: మంత్రి అచ్చెన్నాయుడు

image

మహిళలే నేటి మహారాణులని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రభుత్వం అందించిన సబ్సిడీ ఆటోలను మహిళలకు అందజేశారు. నేడు మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో MLA గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, SP మహేశ్వర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

News April 14, 2026

శ్రీకాకుళం జిల్లాలో 35 ఏళ్ల యువకుడు సూసైడ్

image

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మహాదేవిపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మడియా రామారావు(35) మంగళవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల మందస, సోంపేట మండలాల్లో జరిగిన రెండు హత్య కేసుల్లో ప్రధాన ముద్దాయిగా మృతుడు ఉన్నాడు.

News April 14, 2026

బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్: అచ్చెన్న

image

అంబేడ్కర్ ఆశయాలు కొనసాగిద్దామని మంత్రి అచ్చెన్న అన్నారు. శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ కూడలిలో మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అంబేడ్క‌ర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్నట్లు చెప్పారు. అన్ని వర్గాలకు న్యాయం చేయడం లక్ష్యమని అచ్చెన్న అన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు.