News November 13, 2024
శ్రీకాకుళంలో ఫీల్డ్ ఎయిర్ పోర్టు.?

ఆంధ్రప్రదేశ్‌లో 6 ఎయిర్‌పోర్టుల ఫీజిబిలిటీపై సర్వే మొదలుపెట్టారు. అందులో శ్రీకాకుళం జిల్లాలో 1383 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. అక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. శ్రీకాకుళం జిల్లాతో పాటు మరో 5చోట్ల ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అధ్యయనం చేయడానికి రూ.2.27 కోట్లు విడుదల చేయనున్నారు.
Similar News
News February 8, 2026
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

▶︎ నందిగం: వ్యాన్ ను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి, ఐదుగురికి తీవ్రగాయాలు
▶︎ మరో ప్రమాదంలో యువకుడు మృతి
▶︎ మందస: బాలిగాం రమంలోని ఇళ్లల్లో చోరీ.. బంగారం, నగదు అపహరణ
▶︎ గ్రామీణ రహదారులకు రూ.10.87 కోట్లు: ఎమ్మెల్యే శంకర్
▶︎ మందస: ఈనెల 13 వరకు వాసుదేవుని బ్రహ్మోత్సవాలు
▶︎ సోంపేటలో జర్నలిస్టుల శిక్షణ తరగతులు
▶︎ ఎచ్చెర్ల: అడుగుకో గుంత..వెళ్లేదెలా
News February 8, 2026
SKLM: దారికాచిన మృత్యువు.. ఆసుపత్రికి వెళ్తూ..!

నందిగాం హైవేపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం విషయం తెలిసిందే. ఒడిశాలోని సున్నాపురానికి చెందిన దాలయ్యను కారులో శ్రీకాకుళం ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా ఘటన జరిగింది. ఇందులో ఇద్దరు మృతి చెందగా చంద్రముని, ముత్యాలమ్మ, నీలాద్రి, వెంకటేశ్, రామరావు తీవ్రంగా గాయపడ్డారు. రామారావు పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం తరలించారు. మిగిలిన వారికి టెక్కలిలో చికిత్స సాగుతోంది. భారతి అనే యువతి గాయల్లేకుండా బయటపడింది.
News February 8, 2026
శ్రీకాకుళం: రేపటి నుంచి ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు

విద్యాశాఖ ఆదేశాల మేరకు ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు ఈనెల 9 తేదీ నుంచి మూడు రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని డీఈవో ఏ రవిబాబు తెలిపారు. శనివారం సాయంత్రం శ్రీకాకుళం డీఈవో కార్యాలయంలో ఆయన ప్రకటన విడుదల చేస్తూ ఒకటో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఉదయం, మధ్యాహ్నం కూడా పరీక్షలు కొనసాగుతాయని ఇందుకు సంబంధించి ప్రశ్నాపత్రాలు ఆయా హెచ్ఎంలకు అప్పగించామన్నారు.


