News March 5, 2026
శ్రీకాకుళంలో మర్డర్.. నిందితుడి అరెస్టు

శ్రీకాకుళంలోని వెంకన్నగారిపేట మామిడితోట వద్ద గత నెల 26న <<19247482>>హత్య<<>> జరిగిన విషయం తెలిసిందే. DSP వివరాల మేరకు.. వాంబేకాలనీకి చెందిన మోహన్ రావు(40) హిజ్రాల నాయకుడు. అతనికి హయతీనగరానికి చెందిన ఢిల్లీశ్వరరావు(21)తో శారీరక సంబంధం ఏర్పడింది. బైక్ EMI కోసం రూ.10వేలు కావాలని మోహన్‌ను ఢిల్లీ అడగ్గా ఇవ్వలేదు. దీంతో వాళ్ల మధ్య గొడవలు పెరిగాయి. మోహన్ రావుపై కక్ష పెట్టుకుని ఢిల్లీ హత్య చేశాడని పోలీసులు తెలిపారు.
Similar News
News April 20, 2026
శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.