News October 12, 2025

శ్రీకాకుళంలో రేపు పీజీఆర్ఎస్

image

శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సమస్యలపై అర్జీలను https://Meekosam.ap.gov.in చేసుకోవాలన్నారు. నంబరు 1100 నేరుగా ఫోన్ చేసి వినతుల పరిష్కారం గురించి తెలుసుకోవచ్చునని వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News October 12, 2025

శ్రీకాకుళం జిల్లాకు వర్ష సూచన

image

గత కొన్ని రోజులుగా వర్షాలతో సతమతం అవుతున్న శ్రీకాకుళం జిల్లాకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం రాబోయే 2-3 గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని APSDMA ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

News October 12, 2025

శ్రీకాకుళం: ‘అక్టోబర్ 20 వరకు పుస్తక మహోత్సవం’

image

అక్టోబర్ 20వ తేదీ వరకు 10 రోజుల పాటు శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల జంక్షన్ వద్ద మున్సిపల్ మైదానంలో సిక్కోలు పుస్తక మహోత్సవం–2025 నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ ఛైర్మన్ డాక్టర్ కనుగుల సుధీర్ తెలిపారు. శనివారం పట్టణంలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రదర్శనలో పలు రకాల పుస్తకాలు విక్రయించడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద కళలు ఉంటాయి.

News October 12, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

➸టెక్కలి: ప్రభుత్వ వైఫల్యాలు కోటి సంతకాలతో ప్రజలకు తెలియాలి
➸శ్రీకాకుళం: స్టేడియం నిర్మాణం పూర్తి అయ్యేదెప్పుడో ?
➸సత్యవరంలో తాగునీటికి ఇక్కట్లు.. ఐదు రోజులగా పాట్లు
➸శ్రీకాకుళం: తిలక్ నగర్‌లో చోరీ.. బంగారు ఆభరణాల అపహరణ
➸జలుమూరు: కారును తగలబెట్టిన గుర్తుతెలియని దుండగులు
➸సంతబొమ్మాళి: ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్
➸కంచిలి: ‘వయో పరిమితి 60నుంచి 62ఏళ్లకు పెంచాలి