News December 21, 2024

శ్రీకాకుళం: అంగన్వాడీలకు సెలవు

image

వర్షాల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని అన్ని అంగనవాడీలకు సెలవు ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. సంబంధిత అంగన్వాడీ సిబ్బంది ముందస్తుగా చిన్నారుల తల్లిదండ్రులకు సమాచారం అందించాలని ఆదేశించారు. అలాగే జిల్లాలోని అన్ని స్కూళ్లలో టీచర్లు అప్రమత్తంగా ఉండాలని.. ఇబ్బందిగా ఉన్న చోట ఎంఈవోలు సెలవులు ప్రకటించాలని డీఈఓ తిరుమల చైతన్య ఆదేశించారు.

Similar News

News December 22, 2024

శ్రీకాకుళం: ఎన్నికల క్లయిమ్స్‌పై సూపర్ చెక్ 

image

ఎన్నికల క్లెయిమ్స్‌పై సూపర్ చెక్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం నిర్వహించారు. గడిచిన ఎన్నికలలో ఫారం 6, 7, 8 క్లెయిమ్స్‌కు సంబంధించి డిస్పోజ్ అయి క్లయిమ్స్‌లలో భారత ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన 23 దరఖాస్తులను జిల్లా కలెక్టర్ స్వయంగా సూపర్ చెక్ చేశారు. ఆయా క్లెయిమ్స్ కింద అర్జీ పెట్టుకున్న వారి ఇంటి వద్దకు బిఎల్ఓలు వెళ్లారా? లేదా? అడిగి తెలుసుకున్నారు.

News December 21, 2024

ముచ్చటైన ముగ్గులకు ఆహ్వానం!

image

ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను 97036 22022కు వాట్సాప్ చేయండి.

News December 21, 2024

సిక్కోలు విద్యార్థికి బొంబై ఐఐటీలో అవార్డు

image

బొంబై ఐఐటీలో మార్కెట్ బజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ & టెక్నాలజీ ప్రదర్శనలో సిక్కోలు జిల్లా సోంపేట పట్టణానికి చెందిన మరిడీ ఆదర్శ్ కుమార్ 3 వ స్థానంలో అవార్డు సొంతం చేసుకున్నారు. సముద్ర మార్గాల ద్వారా పయనించే పెద్ద ఓడలు దిగువన, వివిధ మైక్రో ఆర్గాన్స్ అతుక్కోవడంతో వాటి వల్ల సముద్ర తీరం కలుషితం అవుతుందని వాటిని క్లీన్ చేసేందుకు కొత్త పరికరం తాలూకా ప్రదర్శన చేశానని విద్యార్థి తెలిపారు.