News May 29, 2024
శ్రీకాకుళం: అంతర్ కళాశాలల క్రాస్ వర్డ్ పజిల్ పోటీలు

ఆన్‌లైన్ విధానంలో అంతర్ కళాశాలల క్రాస్ వర్డ్ పజిల్ పోటీలను కేంద్ర విద్యాశాఖ నిర్వహిస్తోంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు https://nice.crypticsingh.com/ అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని కోరుతూ ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో ఉత్తమ ప్రతిభ చూపిన వారితో జోనల్, జాతీయ స్థాయిలో పోటీలను ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ తెలిపింది.
Similar News
News November 10, 2025
SKLM: ‘బిల్లుల చెల్లింపు, భూసేకరణ పరిష్కరించాలి’

వంశధార ప్రాజెక్ట్ పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని, పెండింగ్‌లో ఉన్న పనులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. వంశధార ప్రాజెక్ట్ పురోగతిపై సోమవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక ప్యాకేజీల క్రింద పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.18.09 కోట్ల విలువైన బిల్లుల చెల్లింపును వేగవంతం చేయాలన్నారు.
News November 10, 2025
శ్రీకాకుళం కలెక్టర్ గ్రీవెన్స్‌కు 102 అర్జీలు

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌కు జిల్లా నలుమూలల నుంచి 102 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. అందులో రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్, విద్యుత్తు సంస్థ వంటి పలు శాఖలకు దరఖాస్తులు అందాయన్నారు. త్వరగతిన అర్జీలు పూర్తి చేయాలని అధికారులను సూచించారు.
News November 10, 2025
యాక్సిడెంట్.. ఒకరి మృతి

నరసన్నపేట మండలం కోమార్తి జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ కారు మరమ్మతులకు గురికావడంతో పెద్దపాడు నుంచి మెకానిక్ కోరాడ వెంకటేశ్ వచ్చి మరమ్మతులు చేస్తున్నాడు. ఆ సమయంలో వెనక నుంచి వస్తున్న కారు ఆగి ఉన్న కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో వెంకటేశ్ మృతిచెందగా కారులో ఉన్న సంతోశ్, సుశీల, శ్యాముల్ గాయపడ్డారు.


