News March 30, 2025

శ్రీకాకుళం: ‘అట్రాసిటీ చట్టం పటిష్ఠంగా అమలు చేయాలి’

image

అట్రాసిటీ చట్టాలను పటిష్ఠ అమలు, సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం పౌర హక్కుల పరిరక్షణ, అత్యాచార నిరోధక చట్టం (పిసిఆర్ & పిఓఏ యాక్ట్) పై జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీతో ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి, నరసన్నపేట పేట శాసన సభ్యులు బగ్గు రమణమూర్తి‌తో కలసి సమీక్ష నిర్వహించారు.

Similar News

News April 21, 2025

శ్రీకాకుళం: కలెక్టర్ గ్రీవెన్స్‌కు 154 వినతులు

image

ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకాకుళం జడ్పీ కార్యాలయం వేదికైంది. సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో “మీ కోసం” కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జిల్లా పరిషత్ సీఈవో శ్రీధర్ రాజా తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి మొత్తం 154 దరఖాస్తులు స్వీకరించారు. వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు.

News April 21, 2025

ఎచ్చెర్ల: ఈ నెల 26న సీఎం పర్యటన .. స్థల పరిశీలన 

image

ఈ నెల 26న తేదీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎచ్చెర్ల పర్యటించనున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్, జాయింట్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌లు స్థల పరిశీలన చేపట్టారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో మత్స్యకార భరోసా కార్యక్రమానికి సీఎం హాజరుకానందున స్థల పరిశీలన చేశారు. వీరి వెంట పలువురు అధికారులు ఉన్నారు.

News April 21, 2025

రణస్థలం: రోడ్డుకు అడ్డంగా గోడ కట్టేశారు

image

రణస్థలం మండలంలోని కృష్ణాపురం పంచాయతీ గొర్లె పేట గ్రామంలో గంట్యాడ రమణ అనే వ్యక్తి రోడ్డుకు అడ్డంగా గోడ కట్టాడు. దీంతో గ్రామస్థులు అవాక్కయ్యారు. ఇలా రోడ్డుకు అడ్డంగా గోడ కట్టడంతో రాకపోకలు అంతరాయం కలిగింది. ఈ గోడ కట్టడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గ్రామంలోని పలువురు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయిస్తామన్నారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

error: Content is protected !!