News December 23, 2025

శ్రీకాకుళం: ‘అట్రాసిటీ బాధితులకు అండగా ఉండాలి’

image

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో బాధితులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం పూర్తిగా త్వరగా అందించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మందిరంలో జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. బాధితులకు న్యాయం చేయడంలో అలసత్వం వహించకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎస్పీ మహేశ్వర రెడ్డి ఉన్నారు.

Similar News

News December 26, 2025

శ్రీకాకుళం జిల్లా 104లో ఉద్యోగాలు

image

ప్రభుత్వం భవ్య ద్వారా నిర్వహిస్తున్న 104 చంద్రన్న సంచార చికిత్సలో భాగంగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారని శ్రీకాకుళం జిల్లా అధికారి నరసింహమూర్తి శుక్రవారం తెలిపారు. విజయవాడలోని గొల్లపూడి మార్కెట్ యార్డ్‌లో ఈనెల 27, 28 తేదీల్లో డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News December 26, 2025

శ్రీకాకుళం యువకుడిని ట్రాప్ చేసిన వివాహిత

image

శ్రీకాకుళం యువకుడిని విశాఖకు చెందిన భార్యాభర్తలు కలిసి హనీట్రాప్ చేయడంతో అతను రూ.3 లక్షలు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మల్కాపురం ప్రాంతానికి చెందిన సురేంద్రారెడ్డి తన అక్కవాళ్ల ఇంట్లో ఉంటున్నాడు. అక్కవాళ్ల పిల్లలను స్కూల్‌కి తీసుకునివెళ్లే సమయంలో ఓ యువతితో పరిచయం ఏర్పాడగా తన భర్తకు ఈ విషయం తెలిసిపోయిందంటూ అతడిని బెదిరించి రూ.3లక్షలు కాజేసింది. యువకుడు మహరాణిపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News December 26, 2025

వచ్చే ఏప్రిల్ నాటికి పలాస రైల్వే వంతెన: రామ్మోహన్ నాయుడు

image

శ్రీకాకుళం జిల్లా వాసులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పలాస- కాశీబుగ్గ రైల్వే ఓవర్ బ్రిడ్జి వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కార్యాలయం నుంచి గురువారం ప్రకటన వెలువడింది. ఇప్పటికే పలు దఫాలుగా పలాస-కాశీబుగ్గ రైల్వే ఓవర్ బ్రిడ్జితో పాటు, తాలపధ్ర రైల్వే బ్రిడ్జిల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి స్పష్టం చేశారు.