News January 11, 2026

శ్రీకాకుళం: అమృత్ భారత్ రైళ్లు ఆగనున్న స్టేషన్లు ఇవే

image

శ్రీకాకుళం జిల్లాలోని పలు రైల్వేస్టేషన్లలో అమృత్ భారత్ ఆగనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం తెలిపారు. న్యూ జల్పై గురి-హౌరా-బెంగళూరు మార్గంలో భాగంగా శ్రీకాకుళం, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో హాల్ట్ కల్పించారు. 16597-98, 16107-07 నంబర్ గల రైళ్లు శ్రీకాకుళం, పలాసలలో హాల్ట్ కల్పించగా, 202603-04, 20609-10, 16223-24 రైళ్లు శ్రీకాకుళం, పలాస, సోంపేట, ఇచ్ఛాపురంలో ఆగనున్నాయి.

Similar News

News February 20, 2026

శ్రీకాకుళం: కొత్త పంచాయతీలు ఎన్ని ఏర్పడతాయో?

image

శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల్లో 912 పంచాయతీలు ఉన్నాయి. జిల్లాలో చాలాచోట్ల కొత్త పంచాయతీలు ఏర్పాటు కోసం అధికారులకు ప్రతిపాదనలు పంపారు. కొత్తగా 64 పంచాయతీల ప్రతిపాదనలు అధికారులు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి పంపారు. 35 కొత్త పంచాయతీలు ఏర్పాటుకు కమిషనర్ కార్యాలయం నుంచి ఆమోదం లభించింది. ఇంకా కొత్త పంచాయతీలు ఏర్పాటుపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.

News February 20, 2026

B.Ed సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ B.Ed మొదటి సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారి డాక్టర్ ఉదయ్ భాస్కర్ విడుదల చేశారు. కాగా ఈ పరీక్షలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా వేశారు. దీనితో కొత్త తేదీలను ప్రకటించారు. ఈనెల 24 నుంచి మార్చి 2వ తేదీ వరకు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు జరుగుతాయని తెలిపారు.

News February 20, 2026

శ్రీకాకుళం మీదుగా స్పెషల్ ట్రైన్స్

image

శ్రీకాకుళం జిల్లా రైల్వే ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. రానున్న హోలీ పండుగ నేపథ్యంలో జిల్లా మీదుగా సాంత్రగచ్చి-యెలహంక-సాంత్రగచ్చి(నం.02863/64) వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైలు శ్రీకాకుళం రోడ్డు, పలాస స్టేషన్లలో ఆగనుందని రైల్వేశాఖ జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ రైలు మార్చి 5వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.